AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రణరంగంగా మారిన ఢిల్లీ.. 100 మంది విద్యార్థులు అరెస్ట్..!

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు దేశ రాజధాని ఢిల్లీని తాకాయి. దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఏఏకు వ్యతిరేకంగా.. ఆందోళన కారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘర్షణలో నాలుగు బస్సులు అగ్నికి ఆహుతైపోయాయి. మంటలను ఆర్పడానికి వచ్చిన నాలుగు ఫైరింజన్‌లను కూడా ఆందోళన కారులు ధ్వంసం చేశారు. కాగా.. పెద్ద సంఖ్యలో యూనివర్శిటీ విద్యార్థులు.. పోలీసులతో ఘర్షణకు దిగారు. వారిని అదుపు చేసేందుకు లాఠీఛార్జ్ చేసి, బాష్పయువును […]

రణరంగంగా మారిన ఢిల్లీ.. 100 మంది విద్యార్థులు అరెస్ట్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 16, 2019 | 9:57 AM

Share

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు దేశ రాజధాని ఢిల్లీని తాకాయి. దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఏఏకు వ్యతిరేకంగా.. ఆందోళన కారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘర్షణలో నాలుగు బస్సులు అగ్నికి ఆహుతైపోయాయి. మంటలను ఆర్పడానికి వచ్చిన నాలుగు ఫైరింజన్‌లను కూడా ఆందోళన కారులు ధ్వంసం చేశారు. కాగా.. పెద్ద సంఖ్యలో యూనివర్శిటీ విద్యార్థులు.. పోలీసులతో ఘర్షణకు దిగారు. వారిని అదుపు చేసేందుకు లాఠీఛార్జ్ చేసి, బాష్పయువును ప్రయోగించారు. అలాగే ఇప్పటికే యూనివర్శిటీలో పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.

అయితే.. అర్థరాత్రి మళ్లీ జమియా మిలియా యూనివర్శిటీలో ఆందోళనలు మిన్నంటాయి. వందలాది మంది పోలీసులు యూనివర్శిటీలో లోపలా, వెలుపలా పరిస్థితిని సమీక్షిస్తూ చేరుకున్నారు. దీంతో.. నేడు జామియా ఏరియాలోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అంతేకాకుండా దక్షిణ ఢిల్లీలోని 15 మెట్రో స్టేషన్ల గేట్లు మూసి వేశారు అధికారులు. అలీగఢ్ ముస్లి యూనివర్మిటీలోనూ ఆందోళనలు తీరాస్థాయికి చేరాయి. పోలీసులపై విద్యార్థులు రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేసి, టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. జనవరి 5 వరకు జామియా యూనివర్సిటీ సెలవులను ప్రకటించింది యాజమాన్యం. దాదాపు 100 మంది విద్యార్థులను అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. అర్థరాత్రి పోలీస్ హెడ్ క్వార్టర్‌ వద్ద విద్యార్థులు ఆందోళనలు చేశారు. దీంతో వారిని తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో విడిచిపెట్టారు. అలీగఢ్, మీరట్, సహన్‌పూర్‌లో ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. కాగా.. విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీని ఖండించింది కాంగ్రెస్ పార్టీ.

కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
"నాన్న.. ఎప్పటికీ నీ యాదిలో... నీ కొడుకు.."
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా