రాష్ట్రాలు మరిన్ని రుణాలు కోరవచ్చు.. నిర్మలా సీతారామన్

| Edited By: Anil kumar poka

May 17, 2020 | 2:23 PM

కేంద్రం నుంచి రాష్ట్రాలు మరిన్ని రుణాలు కోరవచ్ఛునని ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. ఈ రుణ పరిమితిని 3 శాతం నుంచి 5 శాతం పెంచుతున్నట్టు ఆమె చెప్పారు. ఇందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు అదనంగా...

రాష్ట్రాలు మరిన్ని రుణాలు కోరవచ్చు.. నిర్మలా సీతారామన్
Follow us on

కేంద్రం నుంచి రాష్ట్రాలు మరిన్ని రుణాలు కోరవచ్ఛునని ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. ఈ రుణ పరిమితిని 3 శాతం నుంచి 5 శాతం పెంచుతున్నట్టు ఆమె చెప్పారు. ఇందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు అదనంగా రూ. 4.28 లక్షల కోట్లు లభిస్తాయని, కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా రాష్ట్రాల ఆదాయం గణనీయంగా తగ్గిన విషయం కేంద్రానికి తెలుసునని అన్నారు. రాష్ట్రాలకు అడ్వాన్స్ లిమిట్స్ ని 60 శాతం పెంచాలని రిజర్వ్ బ్యాంకును కోరాం.. ఇందుకు ఆ బ్యాంకు సుముఖత వ్యక్తం చేసింది అని నిర్మల తెలిపారు. ఓవర్ డ్రాఫ్ట్ సమస్యను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పెంచుతున్నామని, ఒక త్రైమాసికంలో  ఈ డ్రాఫ్ట్ పరిమితిని 32 రోజుల నుంచి 50 రోజులకు పెంచుతున్నామని ఆమె వివరించారు.