బైడెన్‌కు అభినందనల సందేశాలు అందడం లేదు…!

|

Nov 12, 2020 | 5:11 PM

డొనాల్డ్‌ ట్రంప్‌ వైఖరి మనకే చికాకు కలిగిస్తుంటే విజేత బైడెన్‌కు ఇంకెంత చిరాకు పుట్టించాలి? మరి ఆయనగారి చేష్టలు అలా ఉన్నాయి.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు బోడెలన్ని అభినందనల సందేశాలు వస్తాయి కదా! పాపం వాటిని చూసుకునే అదృష్టాన్ని బైడెన్‌కు కలిగించడం లేదు ట్రంప్‌ కార్యవర్గం.. వివిధ దేశాధినేతలు పంపిస్తున్న అభినందనల సందేశాలను బైడెన్‌కు అందచేయకుండా నిలిపివేసింది ట్రంప్‌ కార్యవర్గం. దీన్ని బట్టి చూస్తే ట్రంపే కాదు.. ట్రంప్‌ కార్యవర్గం కూడా […]

బైడెన్‌కు అభినందనల సందేశాలు అందడం లేదు...!
Follow us on

డొనాల్డ్‌ ట్రంప్‌ వైఖరి మనకే చికాకు కలిగిస్తుంటే విజేత బైడెన్‌కు ఇంకెంత చిరాకు పుట్టించాలి? మరి ఆయనగారి చేష్టలు అలా ఉన్నాయి.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు బోడెలన్ని అభినందనల సందేశాలు వస్తాయి కదా! పాపం వాటిని చూసుకునే అదృష్టాన్ని బైడెన్‌కు కలిగించడం లేదు ట్రంప్‌ కార్యవర్గం.. వివిధ దేశాధినేతలు పంపిస్తున్న అభినందనల సందేశాలను బైడెన్‌కు అందచేయకుండా నిలిపివేసింది ట్రంప్‌ కార్యవర్గం. దీన్ని బట్టి చూస్తే ట్రంపే కాదు.. ట్రంప్‌ కార్యవర్గం కూడా ఓటమిని అస్సలు ఒప్పుకోవడం లేదనిపిస్తోంది.. బైడెన్‌కు 290 స్థానాలు వస్తాయని అమెరికా మీడియా సంస్థలు అయిదు రోజుల కిందటే ప్రకటించాయి.. చైనా, రష్యా వంటి దేశాలను మినహాయిస్తే దాదాపు అన్ని దేశాలు బైడెన్‌కు విషెస్‌ చెప్పాయి.. దేశాధినేతలు పంపించే అధికారిక సందేశాలను అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది.. ప్రస్తుతం ఈ డిపార్ట్‌మెంట్‌కు సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌గా మైక్‌ పాంపియో వ్యవహరిస్తున్నారు.. ఆయనకు కూడా బైడెన్‌ గెలవడం ఇష్టం లేదు.. పోనీ అధికారాన్ని వదులుతారా అంటే అదీ లేదు.. పైగా ట్రంప్‌కే రెండోసారి అధికార మార్పిడి జరుగుతుందని స్టేట్‌మెంట్లు కూడా ఇస్తున్నారు.. ఇలా అయితే అభినందన సందేశాలు బైడెన్‌కు అందేది ఎలా? అందుకే ఒబామా మాజీ అధికారుల ద్వారా బైడెన్‌కు సందేశాలు అందేలా చూస్తున్నారు. విజయం సాధించినా ఈ గొడవేమిటని బైడెన్‌ తలపట్టుకుంటున్నారు.. అధికార మార్పిడి కోసం న్యాయపోరాటం చేయాలని అనుకుంటున్నారు.. ఇదంతా చూసినవారికి ట్రంప్‌ వైఖరి చికాకు పుట్టించకుండా ఉంటుందా?