ఆ దేశంలో సగం కరోనా కేసులకు ఒక వ్యక్తే కారణమట

| Edited By:

Jul 16, 2020 | 5:07 PM

కరోనాతో ప్రపంచం మొత్తం పోరాటం చేస్తోంది. వేగంగా విస్తరిస్తోన్న ఈ వైరస్‌కు ఎలా అడ్డుకట్ట వేయాలో కూడా ఎవ్వరికీ తెలీడం లేదు.

ఆ దేశంలో సగం కరోనా కేసులకు ఒక వ్యక్తే కారణమట
Follow us on

కరోనాతో ప్రపంచం మొత్తం పోరాటం చేస్తోంది. వేగంగా విస్తరిస్తోన్న ఈ వైరస్‌కు ఎలా అడ్డుకట్ట వేయాలో కూడా ఎవ్వరికీ తెలీడం లేదు. ఇదిలా ఉంటే తమ దేశంలో ఒక వ్యక్తి వలనే సగానికి పైగా కేసులు నమోదయ్యాయంటూ శ్రీలంక ఇటీవల ప్రకటించింది. కరోనా ఎలా వ్యాప్తించదన్న దానిపై విచారణ చేయించిన అక్కడి ప్రభుత్వం అత్యధిక కేసులకు ఓ వ్యక్తినే కారణమంటూ వెల్లడించింది. ప్రస్తుతం ఆ దేశంలో 2600కు పైగా కేసులు ఉండగా.. అందులో సగం మందికి ఓ వ్యక్తి ద్వారానే వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. పేషెంట్‌ 206 అని ప్రస్తావిస్తూ, ఆ వ్యక్తికి ఉన్న డ్రగ్ అలవాటు వలనే వలనే మూడు ప్రాంతాలను క్లస్టర్‌లుగా ప్రకటించాల్సి వచ్చిందని అధికారులు అన్నారు. అయితే ఈ ఆరోపణలను ఆ వ్యక్తి ఖండించారు. తన పేరును ప్రసాద్ దినేష్‌(33)గా చెప్పిన అతడు, అన్యాయంగా తనను అంటున్నారని చెప్పుకొచ్చాడు

ఇంతమందికి వైరస్‌ సోకడానికి(నేవీ నావికులతో కలిపి) నేను కారణమని అనడాన్ని నేను ఒప్పుకోనని దినేష్‌ అన్నాడు. నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందిన ఈ వ్యక్తి ఇటీవలే ఇంటికి రాగా.. పేషెంట్‌ 206 అని చెప్పడం వలన తనకు ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వరని పేర్కొన్నాడు. డ్రగ్స్‌కు అలవాటు పడటం తన తప్పేం కాదని, అయితే కరోనా తరువాత డ్రగ్స్‌ అలవాటును తానే మానేశానని ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు. కాగా గత నెలలో ఓ దొంగతనం కేసులో దినేష్‌ పోలీసులకు పట్టుబడగా.. అతడికి జ్వరం ఉన్నట్లు గుర్తించిన వారు కరోనా టెస్ట్‌ చేయించారు. అందులో పాజిటివ్‌గా రావడంతో అరెస్ట్ చేసిన పోలీసులు, వారితో కాంటాక్ట్ అయిన వారిని క్వారంటైన్‌లో ఉంచారు. అంతేకాదు దాదాపు 900 మంది నేవీ నావికులను కూడా దినేష్‌ కాంటాక్ట్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో వారందరినీ క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు చేశారు.