ఈ నెల 31న శ్రావణ మాసం 2 వ శుక్రవారము పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దుర్గమ్మ వరలక్ష్మి దేవి గా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా ప్రతీ ఏడాది నిర్వహించు సామూహిక వరలక్ష్మీ వ్రతం, ఉచిత సామూహిక ఆర్జిత సేవలను రద్దు చేయడం జరిగినదని ఆలయ అధికారులు తెలిపారు.
భక్తుల సౌకర్యార్థం ప్రధాన ఆలయంలో అమ్మవారికి ఉదయం 8 గంటలకు వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. వ్రతంలో పరోక్షముగా గోత్రనామములతో పూజ జరిపించుకోవడం కోసం టిక్కెట్లు కావాల్సిన భక్తులు www.kanakadurgamma.org ద్వారా డబ్బులు చెల్లించి టిక్కెట్లు పొందాలని సూచించారు.