తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రా వ్యాప్తంగా రేపటి కోసం139 కేంద్రాలను సిద్ధం చేసింది. ప్రతి కేంద్రంలో 30 మంది చొప్పున 4170 మందికి వ్యాక్సిన్ అందిస్తారు. దశల వారీగా కేంద్రాలు, లబ్ధిదారుల సంఖ్య పెంచుకుంటు వెళుతారు. సోమవారం నుంచి 50మందికి చొప్పున వ్యాక్సినేషన్ అందిస్తారు. మొత్తం3.30లక్షల హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ అందిస్తారు. వచ్చే వారం పాటు ప్రభుత్వ సిబ్బందికి మాత్రమే వ్యాక్సిన్ అందజేస్తారు.
దశల వారీగా ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బందికి కూడా వ్యాక్సిన్ అందిస్తారు. తొలి రోజు సఫాయి కార్మికులకు వారు లేని చోట హెల్త్ వర్కర్లకు టీకా అందిస్తారు. 0.5 ఎంఎల్ చొప్పున వ్యాక్సిన్ పంపిణీ జరగుతుంది. గాంధీ, నార్సింగి కేంద్రాల్లో వ్యాక్సిన్ లబ్ధి దారులతో ప్రధాని మోదీ వర్చువల్ ఇంటరాక్షన్‌లో పాల్గొంటారు. మిగిలిన 137 కేంద్రాల్లో మోదీ స్పీచ్ వినేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 2 నుంచి 7 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత మధ్య అధికారులు వ్యాక్సిన్‌ను భద్రపరిచి ఉంచారు. 139 కేంద్రాల దగ్గర ఒక్కో అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. వ్యాక్సిన్ కేంద్రాల వద్ద సీనియర్ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. టీకా వికటించి ప్రమాదం ఉంటే అత్యవసర వైద్యం కోసం అందుబాటులో 57 ఆసుపత్రులు సిద్ధంగా ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 570 ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశారు. ప్రతి వ్యాక్సిన్ కేంద్రంలో అందుబాటులో రియాక్షన్ కంట్రోల్ మెడిసిన్స్ రెడీ చేశారు.