కరోనా పరీక్షలు మరోసారి చేయించుకోండి…

|

Sep 12, 2020 | 7:40 PM

మ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరోసారి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. సోమవారం అసెంబ్లీ ప్రారంభమయ్యేలోపు పరీక్షలు..

కరోనా పరీక్షలు మరోసారి చేయించుకోండి...
Follow us on

Speaker Pocharam Srinivas  : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరోసారి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. సోమవారం అసెంబ్లీ ప్రారంభమయ్యేలోపు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అందరి శ్రేయస్సు దృష్ట్యా సభ్యులందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

సమావేశాలకు హాజరయ్యే అధికారులు సాయంత్రం మరోసారి పరీక్షలు చేయించుకోవాలని పోచారం, గుత్తా తెలిపారు. ప్రస్తుతం సమావేశాలు కొనసాగుతు్న సంగతి తెలిసిందే. అయితే సమావేశాలకు ప్రారంభంలో కూడా ఇదే తరహాలో అధికారులు, సభ్యులు చేయించుకున్నారు. ఇప్పుడు మరోసారి చేయించుకోవాలని కోరారు.