Life’s Back On Track : సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం విహార యాత్రకు బయలు దేరింది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల ఈ సూపర్ స్టార్ కుటుంబం ఎనిమిది నెలలుగా బయట ప్రదేశాలకు వెళ్లకుండా ఇంటికే పరిమితమైంది.
ఎప్పుడు తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండే ప్రిన్స్.. ఇప్పుడు తన ఫ్యామిలో కలిసి టూర్ వెళ్తున్న విషయాన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మహేశ్ సైతం పిల్లలతో కలిసి దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కానీ ఎక్కడికి వెళ్తున్నారనే సంగతిని మాత్రం చెప్పలేదు మహేష్.
కొడుకు గౌతమ్, కూతురు సితారతో కలిసి విమానాశ్రయంలో సెల్ఫీ దిగిన మహేశ్..కరోనాను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు పాటిస్తూనే తిరిగి సాధారణ జీవనం గడిపేందుకు మహేశ్ కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్తున్నారు. అందులో భాగంగా మహేశ్ కుటుంబం అంతా ఫేస్ మాస్కులు ధరించి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు.
మరోవైపు త్వరలోనే “సర్కారు వారి పాట” సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. దీంతో హీరో.. ఈ చిన్న బ్రేక్‌లో పెద్ద వినోదాన్ని ప్లాన్ చేశారు. అయితే హాలీడే ట్రిప్ ముగియగానే టంచనుగా సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు. ఇక “సర్కారు వారి పాట” సినిమాలో మహేశ్ సరసన హీరోయిన్ కీర్తి సురేశ్ జోడీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ కమర్షియల్ మసాలా ఎంటర్‌టైనర్‌ను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు.