South Africa COVID-19 Vaccines: కరోనా వ్యాక్సిన్‌ రహస్య ప్రదేశంలో నిల్వ చేయనున్న దక్షిణాఫ్రికా

South Africa COVID-19 Vaccines: కరోనా వ్యాక్సిన్‌ బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయించే అవకాశం ఉన్నందున దక్షిణాఫ్రికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది...

South Africa COVID-19 Vaccines: కరోనా వ్యాక్సిన్‌ రహస్య ప్రదేశంలో నిల్వ చేయనున్న దక్షిణాఫ్రికా
Follow us

|

Updated on: Jan 11, 2021 | 5:21 PM

South Africa COVID-19 Vaccines: కరోనా వ్యాక్సిన్‌ బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయించే అవకాశం ఉన్నందున దక్షిణాఫ్రికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయో కొన్ని వారాల్లో భారతదేశం నుంచి అందుకునే 1.5 మిలియన్‌ మోతాదుల కోవిడ్‌ వ్యాక్సిన్‌లను రహస్య ప్రదేశంలో నిల్వ చేస్తున్నట్లు దక్షిణాఫ్రికా ఆరోగ్యశాఖ ప్రతినిధి పోపో మాజా మీడియాకు వెల్లడించారు. టీకాలు దొంగతనంగా బ్లాక్‌ మార్కెట్ కు తరలుతున్న నేపథ్యంలో రహస్య ప్రదేశంలో నిల్వ చేసేందుకు సిద్ధమైంది. వ్యాక్సిన్లు బ్లాక్‌ మార్కెట్‌ తరలితే ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని పోపో మాజా తెలిపారు. ఇలా జరిగితే బ్లాక్‌ మార్కెట్‌ దందా మరింత పెరిగి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే టీకా దొంగిలించబడి బ్లాక్‌ మార్కెట్‌కు చేరుకున్న తర్వాత చాలా ఖరీదైన వస్తువుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇప్పటికే టీకాలు వేయడం ప్రారంభించిన పలు దేశాల్లో భారీగా బ్లాక్‌ మార్కెట్‌ దందా జరుగుతోంది. అందుకే నిల్వ చేసే వ్యాక్సిన్లు ఎక్కడ నిల్వ చేస్తున్నామనే విషయాన్ని బయట పెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా ఆరోగ్యశాఖ మంత్రి జ్వేలీ గత వారం పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ.. కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌ నుంచి 1.5 మిలియన్‌ మోతాదుల ఆస్టాజెనికా కోవిడ్‌ వ్యాక్సిన్లు పొందుతున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరు వరకు భారతదేశం నుంచి 10 లక్షలు, ఫిబ్రవరిలో మరో 5 లక్షల మోదుతా వ్యాక్సిన్‌ డోసులను పొందనున్నట్లు తెలిపారు.

Also Read: New Strain Virus: బ్రెజిల్‌ ప్రయాణికుల్లో మరో కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌.. గుర్తించిన జపాన్ ఆరోగ్యశాఖ