పంజాబ్‌ స్టేట్‌ ఐకాన్‌గా ‘రియల్ హీరో’ సోనుసూద్‌

సాయం అంటే చాలు అతడు ఎగబడి వెళ్లిపోతాడు. లాక్‌డౌన్ కాలంలో వలస కార్మికులకు అతడు దేవుడు. అయినవాళ్లను కోల్పోయినవారికి ఆపద్బాంధవుడు.

పంజాబ్‌ స్టేట్‌ ఐకాన్‌గా రియల్ హీరో సోనుసూద్‌

Updated on: Nov 17, 2020 | 11:22 AM

సాయం అంటే చాలు అతడు ఎగబడి వెళ్లిపోతాడు. లాక్‌డౌన్ కాలంలో వలస కార్మికులకు అతడు దేవుడు. అయినవాళ్లను కోల్పోయినవారికి ఆపద్బాంధవుడు. చదువుకునే స్థోమతలేనివారికి ప్రతిఫలం ఆశించని గురువు. అన్నీ అతడే…అతడే సోనుసూద్‌. ఈ నటుడి గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కరోనా కష్టకాలంలో అతడు చేసిన సాయాలు అన్నీ ఇన్నీ కావు. కాగా తాజాగా సోనుసూద్‌ను పంజాబ్‌ స్టేట్‌ ఐకాన్‌గా భారత ఎన్నికల సంఘం నియమించింది. పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎస్ కరుణరాజు ఈసీఐకి పంపిన ప్రతిపాదనను ఆమోదించింది.

సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా నటించి గుర్తింపు తెచ్చుకున్న సోనుసూద్‌ది పంజాబ్‌ రాష్ట్రంలోని మోగా జిల్లా. కోవిడ్ విజృంభణ సమయంలో‌ వలస కార్మికులు వారి స్వస్థలాలకు చేరుకునేందుకు బస్సులను ఏర్పాటు చేసి తన మంచి మనసు చాటుకున్నారు పలు దేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశాలకు రప్పించేందుకు సొంత ఖర్చులతో విమానాలను ఏర్పాటు చేయించాడు. కష్టం అనే మాట వస్తే వినిపిస్తే చాలు నేనున్నాంటూ ముందుకు వచ్చాడు. అనేకమంది పేద పిల్లలకు ఉచిత విద్య, వైద్య సదుపాయాలను కూడా అందిస్తున్నాడు. కాగా సోనుసూద్ సేవలకి ఇటీవల ఐక్యరాజ్యసమితి (యుఎన్‌డీపీ) ఎస్‌డీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డును బహుకరించిన విషయం తెలిసిందే.

Also Read :

స్టేట్ సెక్యూర్టీ కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు చోటు కల్పిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు

జగిత్యాల : పాడుబడ్డ ఇంట్లో కుళ్లిన స్థితిలో యువతీ, యువకుల మృతదేహాలు..ప్రేమ జంటేనా..? లేక !

కాజల్ హనీమూన్‌పై ట్రోలింగ్ !