Hyderabad News :హైదరాబాద్‌లో దారుణం, తల్లి మృతదేహంతో మూడ్రోజులుగా ఇంట్లోనే ఉన్న కొడుకు..ఏం జరిగింది..?

|

May 14, 2022 | 6:36 PM

హైదరాబాద్ మల్కాజ్‌గిరిలో దారుణ ఘటన వెలుగు చూసింది. మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధి విష్ణుపురి కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌ ప్లాట్‌లో కుళ్లిపోయిన స్థితిలో ఒక మహిళ మృతదేహం కలకలం రేపింది. అపార్ట్‌మెంట్లోని ఓ ప్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో

Hyderabad News :హైదరాబాద్‌లో దారుణం, తల్లి మృతదేహంతో మూడ్రోజులుగా ఇంట్లోనే ఉన్న కొడుకు..ఏం జరిగింది..?
Mother's Dead Body
Follow us on

హైదరాబాద్ మల్కాజ్‌గిరిలో దారుణ ఘటన వెలుగు చూసింది. మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధి విష్ణుపురి కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌ ప్లాట్‌లో కుళ్లిపోయిన స్థితిలో ఒక మహిళ మృతదేహం కలకలం రేపింది. అపార్ట్‌మెంట్లోని ఓ ప్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల అపార్ట్‌మెంట్ వాసులు మల్కాజ్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..ఆ ఫ్లాట్ డోర్ తీసి చూసి షాక్ అయ్యారు. ఇంట్లో ఓ మహిళ డెడ్ బాడీ కనిపించింది. ఆ పక్కనే ఆమె కుమారుడు అక్కడే ఉన్నాడు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న తల్లి మృతదేహం వద్దే కూర్చుని ఉన్న కొడుకు సాయికృష్ణని చూసిన స్థానికులు సైతం నివ్వెరపోయారు. ఇంతకీ ఇక్కడ ఏం జరిగింది..?అనేది పూర్తి వివరాలు పరిశీలించగా..

మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణుపురి కాలనీ మైత్రి నివాస్ అపార్ట్‌మెంట్‌లో ఈ షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్‌ 202 నంబర్ ప్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల అపార్ట్‌మెంట్ వాసులు మల్కాజ్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఫ్లాట్ తలుపులు తీసి చూడగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న తల్లి విజయ మృతదేహం వద్ద కొడుకు సాయికృష్ణ కూర్చున్నాడు. దాంతో కొడుకు సాయికృష్ణనే తల్లి విజయను చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. విజయ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అయితే, అపార్ట్‌మెంట్ వాసులు చెబుతున్న దాన్నిబట్టి..సాయికృష్ణ మానసిక స్థితి బాగోలేదని తెలిసింది. తరచూ తల్లి కొడుకుల గొడవ జరిగేదని స్థానికులు చెబుతున్నారు. విజయను కొడుకు సాయికృష్ణ హత్యచేసి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఏది ఏమైనా నిర్జీవంగా పడివున్న తల్లి మృతదేహం పక్కనే ఉన్న ఆ కొడుకు చూసిన స్థానికులు ఒకింత భయాందోళనకు గురయ్యారు.

Navneet Rana Case: మహారాష్ట్రకు పొంచివున్న పెనుప్రమాదం..! అందుకే హనుమాన్‌ చాలిసా పఠనం అంటున్న ఎంపీ నవనీత్‌ రాణా ..

DMK leader’s murder: డీఎంకే నేత దారుణ హత్య, శరీరాన్ని ముక్కలుగా నరికేసిన మహిళ..ఇప్పటికీ దొరకని తల..!

Annavaram Temple: సత్యదేవుని ఉత్సవాల్లో అపచారం.. మందు, చిందులతో అశ్లీలం, చర్యలు తప్పవంటున్న ఆలయ ఈవో..

TTD VIP break darshan: వెంకన్న భక్తులకు ముఖ్య గమనిక..! సామాన్యులకు టీటీడీ పెద్దపీట వేసింది

Telangana : కర్మ భూమిలో పూసిన పూలు, కాళ్ల పారాణితో కాటిబాటపట్టిన పెళ్లికూతుళ్లు..మొన్న సృజన, నేడు లక్ష్మీ..