గర్భిణి స్నేహ మార్షల్ ఆర్ట్స్.. మమూలుగా లేవు కదా!

| Edited By:

Jan 19, 2020 | 11:40 AM

నటి స్నేహ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తమిళ, మళయాల, కన్నడ సహా తెలుగు భాషల్లోనూ.. ఆమె పలు సినిమాల్లో నటించి మెప్పించారు. తాజాగా దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఇటీవల విడుదలైన చిత్రం ‘పటాస్’. ఈ సినిమాలో స్నేహ ముఖ్య పాత్ర పోషించింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 15న విడుదలైన పటాస్ చిత్రం మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. వర్మ కళ ఆధారంగా ధనుష్ పటాస్ సినిమా తెరకెక్కింది. ఇందులో […]

గర్భిణి స్నేహ మార్షల్ ఆర్ట్స్.. మమూలుగా లేవు కదా!
Follow us on

నటి స్నేహ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తమిళ, మళయాల, కన్నడ సహా తెలుగు భాషల్లోనూ.. ఆమె పలు సినిమాల్లో నటించి మెప్పించారు. తాజాగా దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఇటీవల విడుదలైన చిత్రం ‘పటాస్’. ఈ సినిమాలో స్నేహ ముఖ్య పాత్ర పోషించింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 15న విడుదలైన పటాస్ చిత్రం మంచి టాక్‌ని సొంతం చేసుకుంది.

వర్మ కళ ఆధారంగా ధనుష్ పటాస్ సినిమా తెరకెక్కింది. ఇందులో మొదటి భాగం కన్నా ద్వితీయార్థం చాలా కీలకమైనది. ఈ సినిమా కోసం ‘అడిమురై అనే వర్మ కళ’ (మార్షల్ ఆర్ట్స్)ను నేర్చుకుని అందరినీ అబ్బురపరిచింది స్నేహ. ఆమె గర్భంతో ఉన్న సంగతి కూడా మర్చిపోయి.. సినిమా కోసం ఏదైనా చేయడానికి రెడీ అన్న భావనతో ఆమె మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు.

నిజానికి ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత స్నేహ గర్భం దాల్చింది. అయినప్పటికీ ఇచ్చిన కాల్ షీట్ ప్రకారం ఇంట్లోనే శిక్షణ తీసుకుని, సినిమా చేసింది స్నేహ. కథ ప్రకారం చెన్నైలోని గిండి ఫ్లైఓవర్ వద్ద షూట్ చేసిన ఫైట్ సీన్‌లో ఆమె అడిమురై కళతో తన పోరాట పటిమను ప్రదర్శించాల్సి ఉంటుంది. అప్పుడు ఆమె నాలుగు నెలల గర్భిణి. అయినప్పటికీ వైద్యుల సలహాల మేరకు ఆ సన్నివేశంలో నటించి మెప్పించింది. కాగా.. ఈ సినిమా షూటింగ్ సమయంలో స్నేహ భరత్ ప్రసన్న అనుక్షణం ఆమెకు తోడుగా ఉంటూ ఎంతో సహకరించారని దర్శకుడు దురై సెంథిల్ తెలిపారు.