పాములు అత్యంత విషపూరితమైన జీవులు అన్న విషయం తెలిసిందే. ఒకే ఒక్క కాటుతో అవి మనుషులు, జంతువులు ప్రాణాలును హరిస్తాయి. కాగా పాములను పూజించేవారు.. వాటికి ఆహారంగా పాలను, గుడ్లను పెడతారు. కాగా పాము ఆ గుడ్లను నిజంగానే తింటుందా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. దాన్ని ఇప్పుడు మేము క్లారిఫై చేస్తాం. ఒక పాము ఆకలిగా అనిపించి అడవిలో వేట ప్రారంభించింది. ఈ క్రమంలో దానికి పెద్ద, పెద్ద పక్షి గుడ్లు తారసపడ్డాయి. ముందుకు అటు, ఇటూ కాసేపు రెక్కీ చేసిన ఆ పాము… కొద్ది సేపట్లోనే ఓ భారీ గుడ్డును ఆశ్చర్చకరంగా మింగేసింది. ఈ షాకింగ్ వీడియో లైఫ్ అండ్ నేచర్ ట్విట్టర్ పేజీలో షేర్ చేయబడింది. ఈ వీడియో ఇప్పటికే వేలాది వీక్షణలను పొందింది. చాలా మంది వినియోగదారులు కూడా దీనిపై ఆశ్చర్యకరమైన కామెంట్లు పెడుతున్నారు. ప్రజలు ఈ వీడియోను లైక్స్, షేర్స్‌తో హోరెత్తిస్తున్నారు.ఈ దృశ్యం నిజంగా ఆశ్చర్యకరంగా ఉందని ఒక వినియోగదారు రాసుకొచ్చాడు. అదే సమయంలో, పాములు గుడ్లను కూడా తమ ఆహారంగా చేసుకోగలవా.. నేను దీన్ని మొదటిసారి చూశాను.. అని మరొక యూజర్ పేర్కొన్నాడు. కాగా పాములు గుడ్లను తమ ఆహారంగా చేసుకోగలవని ఈ వీడియోతో మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది.
Snake preying on eggs pic.twitter.com/kcHPT53WR8
— Life and nature (@afaf66551) June 3, 2021
Also Read: తెలంగాణలో రేషన్ కార్డుదారులకు నేటి నుంచే ఉచిత రేషన్ బియ్యం పంపిణీ.. ఒక్కొక్కరి 15 కేజీలు