తీరంలో చీలిక.. భారీ ముప్పు పొంచి ఉందా..!

| Edited By:

Jul 20, 2020 | 9:16 AM

బంగాళాఖాతంలో 300కి.మీ పొడవున లోతైన చీలిక ఏర్పడినట్లు సముద్ర అధ్యయన జాతీయ సంస్థ హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గుర్తించారు. తూర్పు గోదావరి నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు తీరం పొడవునా ఈ చీలిక ఉన్నట్లు వారు గుర్తించారు. ఈ చీలిక ఎలా ఏర్పడింది..? దాని పర్యావసనాలు ఏమిటి..? ముప్పును ఎలా ఎదుర్కోవచ్చనే అంశాలపై శాస్త్రవేత్తలు ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నారు. సాధారణంగా నదుల నుంచి సముద్రంలోకి నీళ్లతో పాటు మట్టి, రాళ్లు, ఇతర వ్యర్థాలు చేరుతుంటాయి. కొన్ని […]

తీరంలో చీలిక.. భారీ ముప్పు పొంచి ఉందా..!
Follow us on

బంగాళాఖాతంలో 300కి.మీ పొడవున లోతైన చీలిక ఏర్పడినట్లు సముద్ర అధ్యయన జాతీయ సంస్థ హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గుర్తించారు. తూర్పు గోదావరి నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు తీరం పొడవునా ఈ చీలిక ఉన్నట్లు వారు గుర్తించారు. ఈ చీలిక ఎలా ఏర్పడింది..? దాని పర్యావసనాలు ఏమిటి..? ముప్పును ఎలా ఎదుర్కోవచ్చనే అంశాలపై శాస్త్రవేత్తలు ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నారు.

సాధారణంగా నదుల నుంచి సముద్రంలోకి నీళ్లతో పాటు మట్టి, రాళ్లు, ఇతర వ్యర్థాలు చేరుతుంటాయి. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ జరగడం వలన లక్షల టన్నుల అదనపు భారం సముద్ర గర్భంపై పడింది. దీంతో ఒత్తిడి కూడా పెరుగుతూ.. భారాన్ని భరించలేక సముద్ర గర్భంలో భూమి కంపించింది. ఈ ధాటికి సముద్ర గర్భంలోని భూమి చీలిపోయినట్లు తెలుస్తోంది. ఇక చీలిక లోతు 100 మీటర్ల నుంచి 900 మీటర్ల వరకు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గోదావరి ప్రాణహిత గ్రాబెన్ నుంచి నాగావళి వంశధార షియర్‌జో వరకు దాదాపు 300కి.మీల దూరం భూమి చీలినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. అందులోని రాళ్లు, మట్టి నమూనాల ఆధారంగా ఈ చీలిక 16 మిలియన్ సంవత్సరాల కిందటే ఏర్పడిందని గుర్తించారు. ఇక ఈ చీలికలోకి చేరిన పూడికపై కొత్తగా వచ్చి చేరే మట్టి రాళ్లు, ఇసుక వల్ల ఈ ఒత్తడి పెరుగుతోందని, ఫలితంగా భూకంపం వచ్చి అది సునామీకి దారితీయొచ్చని శాస్త్రవేత్తలు విశ్లేషణ చేస్తున్నారు. చీలిక కారణంగా భవిష్యత్తులో ఉత్తరాంధ్ర ప్రాంతానికి భూకంపాలు, సునామీల ముప్పు పొంచి ఉంది. అది ఎప్పుడన్నది చెప్పలేం అని అధ్యయన బృందంలోని ఓ శాస్త్రవేత్త అన్నారు.