చిన్నారిని సవతి తల్లే చంపేసింది..!

|

Nov 24, 2019 | 8:33 PM

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏడేళ్ల చిన్నారి కిడ్నాప్‌, హత్య ఘటన కలకలం రేపింది. రెండ్రోజుల క్రితం స్కూల్‌ నుంచి కిడ్నాప్‌కు గురైన దీప్తిశ్రీని సవతి తల్లి కిడ్నాప్‌ చేసి హత్య చేసిందని దీప్తి నాయనమ్మ ఆరోపించింది. గతంలో కూడా దీప్తికి వాతలు పెట్టడం లాంటివి చేసిందని దీప్తి నానమ్మ చెప్తోంది. దీంతో సవతి తల్లి శాంతికుమారిని అదుపులోకి తీసుకుని విచారించడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీప్తిశ్రీని గొంతునులిమి హత్యచేసినట్లు విచారణలో ఒప్పకుంది. అయితే పోలీసులు దీన్నింకా […]

చిన్నారిని సవతి తల్లే చంపేసింది..!
Follow us on

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏడేళ్ల చిన్నారి కిడ్నాప్‌, హత్య ఘటన కలకలం రేపింది. రెండ్రోజుల క్రితం స్కూల్‌ నుంచి కిడ్నాప్‌కు గురైన దీప్తిశ్రీని సవతి తల్లి కిడ్నాప్‌ చేసి హత్య చేసిందని దీప్తి నాయనమ్మ ఆరోపించింది. గతంలో కూడా దీప్తికి వాతలు పెట్టడం లాంటివి చేసిందని దీప్తి నానమ్మ చెప్తోంది. దీంతో సవతి తల్లి శాంతికుమారిని అదుపులోకి తీసుకుని విచారించడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీప్తిశ్రీని గొంతునులిమి హత్యచేసినట్లు విచారణలో ఒప్పకుంది. అయితే పోలీసులు దీన్నింకా నిర్ధారించలేదు. చిన్నారి మృతదేహాన్ని కాల్వలో పడేశానని కాసేపు, డంపింగ్‌ యార్డ్‌ వద్ద పడేసానని పోలీసుల విచారణలో రకరకాలుగా సమాధానాలు చెప్తుండడంతో పోలీసులు ఆమె చెప్పిన అన్ని చోట్లా గాలింపు కొనసాగిస్తున్నారు. దీప్తి ఆచూకీ లభించకపోవడంతో నాయనమ్మ, మేనత్త చిన్ని, బేబి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

చిన్నారి స్కూల్‌ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు పోలీసులు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఓ మహిళ పాఠశాలకు వచ్చి ఆమెని కొద్ది దూరం తీసుకువెళ్లి ఆ తర్వాత బైక్‌పై ఓ వ్యక్తితో వెళ్లినట్లు తెలుస్తోంది. బాలిక మిస్సింగ్‌ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న ఉదయం నుంచి చిన్నారి సవతి తల్లి శాంతికుమారి, ఆమె బంధువులను స్టేషన్‌లో విచారణ చేస్తున్నారు. కాకినాడ సామర్లకోట రోడ్డులోని పంట, మురుగు కాలువల్లో వెతికిస్తున్నారు. మరోవైపు కాకినాడలో ఉప్పుటేరు కాలువలో పడేసిన చిన్నారి దీప్తిశ్రీ డెడ్‌బాడీని గాలించేందుకు అధికారులు ధర్మాడి సత్యం బృందం సహకారాన్ని తీసుకున్నారు. చనిపోయిన తర్వాత 30 గంటలు గడిస్తే మృతదేహం బయటకు తేలుతుందంటున్నారు సత్యం. చీకటి పడటంతో ప్రస్తుతానికి గాలింపు చర్యలు నిలిపివేశారు. రేపు ఉదయాన్నే మళ్లీ ప్రారంభించనున్నారు.