మంత్రి పేర్నిపై దాడి చేసింది నా సోదరుడే… స్పందించిన టీడీపీ మహిళా నేత

|

Nov 30, 2020 | 7:22 PM

ఏపీ మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం కేసులో నిందితుడు నాగేశ్వరరావు సోదరి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు బడుగు ఉమాదేవి స్పందించారు. అతను అలా ఎందుకు చేశాడో మాకే అర్ధం కాక షాక్‌కి గురయ్యామన్నారు. అయితే తాను మాత్రమే రాజకీయాల్లో ఉన్నానని...

మంత్రి పేర్నిపై దాడి చేసింది నా సోదరుడే... స్పందించిన టీడీపీ మహిళా నేత
Follow us on

ఏపీ మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం కేసులో నిందితుడు నాగేశ్వరరావు సోదరి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు బడుగు ఉమాదేవి స్పందించారు. అతను అలా ఎందుకు చేశాడో మాకే అర్ధం కాక షాక్‌కి గురయ్యామన్నారు. అయితే తాను మాత్రమే రాజకీయాల్లో ఉన్నానని… తాపీ మేస్త్రీ పని చేసుకునే నా సోదరుడికి రాజకీయాలు అంటకట్టడం సరికాదన్నారు. తన తమ్ముడు చేసింది తప్పే కాబట్టి శిక్షపడాలని కోరుకుంటున్నానని ఆమె అన్నారు. అయితే ఎవరో చెబితే తన తమ్ముడు దాడి చేసాడనటం సరికాదన్నారు.

కృష్ణా జిల్లా బందరులోని మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం కలకలం రేపింది. మంత్రి ఇంట్లో పెద్ద కర్మ జరిగింది. ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుని బయటకు వస్తున్న సమయంలో మంత్రిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముందు పేర్నినాని కాళ్లపై పడబోయాడు నాగేశ్వరరావు. చేతిలో ఉన్న తాపీని తీసి పొట్టలో పొడవబోయాడు. మంత్రి పెట్టుకున్న బెల్ట్‌ బకెల్‌కు తాపి తగలడంతో వంకర పోయింది. మరోసారి తాపీతో పొట్టలో పొడవబోయే సరికి పక్కనే ఉన్న మంత్రి అనుచరులు అతడిని పట్టుకున్నారు.

దాడి చేసిన వ్యక్తి బందరులోని చెమ్మన్నగిరి పేటకు చెందిన బడుగు నాగేశ్వరరావుగా గుర్తించారు. దాడి సమయంలో అతడు మద్యం తాగి ఉన్నాడు. నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు నాగేశ్వరరావు నేర చరిత్రపై ఆరా తీశారు. పార్టీలతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేశారు. అయితే నాగేశ్వరరావు సోదరి టీడీపీ నాయకురాలని ఆ తర్వాత తేలింది. ఈ హత్యాయత్నం కేసులో వాళ్లకు ఏమైనా ప్రమేయం ఉందా అన్న కోణంలో కూపీ లాగుతున్న సమయంలో  బడుగు ఉమాదేవి స్పందించారు.