#GHMC Elections: గ్రేటర్‌లో గెలిచేది ఎవరు?

గ్రేటల్ హైదరాబాద్‌ మునిసిపల్ కార్పొరేషన్‌ ఎన్నికలను ప్రధానపార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. ప్రచారపర్వంలో ఎన్నడూ లేనంత ఉత్సాహం, ఉద్వేగం కనిపించాయి.. కోవిడ్‌ కాలంలో కూడా ఊరేగింపులు, సభలు, సమావేశాలు భారీ ఎత్తున జరగడం..

#GHMC Elections: గ్రేటర్‌లో గెలిచేది ఎవరు?
Follow us
Balu

| Edited By: Ravi Kiran

Updated on: Dec 01, 2020 | 1:19 PM

గ్రేటల్ హైదరాబాద్‌ మునిసిపల్ కార్పొరేషన్‌ ఎన్నికలను ప్రధానపార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. ప్రచారపర్వంలో ఎన్నడూ లేనంత ఉత్సాహం, ఉద్వేగం కనిపించాయి.. కోవిడ్‌ కాలంలో కూడా ఊరేగింపులు, సభలు, సమావేశాలు భారీ ఎత్తున జరగడం ఆశ్చర్యాన్ని కలిగించింది.. ఆదివారం సాయంత్రం వరకు అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు.. నిమిషాన్ని కూడా వృధా చేయకుండా గడపగడపా తిరిగారు. ఇక కాసేపట్లో పోలింగ్‌ మొదలు కాబోతున్నది.. ఇప్పుడు అభ్యర్థులంతా అంకగణితంలో బిజీ అయ్యారు. తమ విజయానికి అవకాశాలెన్ని ఉన్నాయో లెక్కలేసుకుంటున్నారు.. ఏ పోలింగ్‌బూత్‌లో ఎన్ని ఓట్లు పడతాయో అంచనాలు వేసుకుంటున్నారు. ఈ ఎన్నికలు చాలా చోట్ల అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యనే జరుగుతోంది.. కొన్ని చోట్ల కాంగ్రెస్‌ కూడా పోటీ ఇస్తుంది.. ఈ పోటాపోటీలో ఎవరు విజయం సాధిస్తారన్నది మరో అయిదు రోజుల్లో తేలిపోతుంది.. ఇవాళ జరిగే ఓటింగ్‌ సరళిని బట్టి ఓ అంచనాకు రావచ్చు.. ప్రచారంలో అధికార టీఆర్‌ఎస్‌ అభివృద్ధినే ప్రధానంశం చేసుకుంది.. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధిని ఓటర్లకు విపులంగా వివరించింది.. ఏం చేయబోతున్నామో కూడా చెప్పుకుంది.. అధికారంలో ఉన్న పార్టీనే జీహెచ్‌ఎంసీ పీఠంలో ఉంటే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో స్పష్టం చేసింది.. మేనిఫెస్టోలో ప్రస్తావించిన వాటిని కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చింది.. ఇంటి పన్నును సగానికి సగం తగ్గించడం, ఉచితంగా 20 వేల లీటర్ల వరకు మంచినీటి ఇస్తామన్న హామీ ఓటర్ల బాగా చేరువయ్యాయి.. హైదరాబాద్‌ వరదల్లో నష్టపోయిన వారికి పది వేల రూపాయల ఆర్ధికసాయం కూడా టీఆర్‌ఎస్‌కు కలిసివచ్చే అంశం.. అయితే చాలా మందికి ఈ సాయం అందకపోవడం ఓ రకంగా ఇబ్బందికరమే అయినా ఆర్ధికసాయం ఎందుకు నిలిపివేయాల్సి వచ్చిందో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగింది టీఆర్‌ఎస్‌.. మొన్న శనివారం లాల్‌బహదూర్‌ స్టేడియంలో జరిగిన కేసీఆర్‌ సభతో టీఆర్‌ఎస్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది.. ఎప్పటిలాగే కేసీఆర్‌ తన వాగ్ధాటితో ఓటర్లను ఆకట్టుకోగలిగారు. ఇక బీజేపీ ఇటీవల వచ్చిన వరదలను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేసింది.. తాము గ్రేటర్‌ పాలన పగ్గాలను చేపడితే ఏం చేస్తామో కూడా చెప్పింది.. గెలవాలన్న లక్ష్యంతో ఉత్తరాది నాయకులను రంగంలోకి దించింది.. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు అందరూ హైదరాబాద్‌ ప్రచారానికి వచ్చారు.. వారి రాకతో ప్రచారంలో వేడి పెరిగిన మాట వాస్తవమే!

ఇక పాతబస్తీలో ఎప్పటిలాగే మజ్లిస్‌కే అత్యధిక స్థానాలు రావచ్చు.. అయితే ఓల్డ్‌ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు స్థిరపడ్డారు.. వీరు ఎవరికి ఓటు వేస్తారో అంతుపట్టకుండా ఉంది.. కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఎనిమిది డివిజన్‌లలో టీఆర్‌ఎస్‌ ఇంచుమించు క్లీన్‌ స్వీప్‌ చేసింది.. కేపీహెచ్‌బీ డివిజన్‌లో మాత్రం తెలుగుదేశం పార్టీ గెలిచింది.. లాస్ట్‌ టైమ్‌ టీడీపీ గెల్చిన ఏకైక డివిజన్‌ ఇదే! ఆ తర్వాత ఆ కార్పొరేటర్‌ కూడా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారనుకోండి.. అది వేరే విషయం. ప్రస్తుతం మూసాపేటలో త్రిముఖ పోటీ ఉంది.. ఇక్కడ అధికార టీఆర్‌ఎస్‌కు అడ్వాంటేజ్‌ ఉన్నా కాంగ్రెస్‌ గట్టి పోటీనే ఇస్తున్నది.. అయితే టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులిద్దరూ మూసాపేటకు చెందిన వారే కావడంతో ఇక్కడ ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది.. గెలుపోటములను ఈ అంశం కొద్దిగా ప్రభావం చూపవచ్చు.. మోతీనగర్‌లోనూ అంతే.. ఇక్కడా టీఆర్‌ఎస్‌కు ఎడ్జ్‌ ఉన్నా కాంగ్రెస్‌ మంచి పోటీనే ఇస్తున్నది.. క్రితం సారి విజయం సాధించిన టీడీపీ ఇప్పుడు కేపీహెచ్‌బీలో తన అస్థిత్వాన్ని చాటుకునే ప్రయత్నంలో ఉంది.. ఇక్కడ మాత్రం టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పోటీ ఉంది.. సెటిలర్లు ఎక్కువగా ఉండే ఈ డివిజన్‌లో కచ్చితంగా వీరు గెలుస్తారని చెప్పడం ఒకింత కష్టంగానే ఉంది. బాలాజీనగర్‌ డివిజన్‌లోనూ టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. కాకపోతే అనుభవం టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి కలిసివస్తున్నది. అల్లాపూర్‌లో కూడా అధికార టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంది.. అయితే ఇక్కడ మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి టీఆర్‌ఎస్‌కు కాసింత ఎడ్జ్‌ ఉన్నట్టు కనిపిస్తోంది. ఫతేనగర్‌ డివిజన్‌లో, బోయినపల్లి డివిజన్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పోటీ ఉంది.. బాలానగర్‌లో మాత్రం టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ ఉంది..

బాలానగర్‌లో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. కూకట్‌పల్లి డివిజన్‌లో ముక్కోణపు పోటీ ఉంది. ఇక శేరిలింగంపల్లిలో ఏడు డివిజన్‌లు ఉన్నాయి.. అధికార టీఆర్‌ఎస్‌కు బీజేపీ కాస్త పోటీనిస్తున్నప్పటికీ మెజారిటీ సీట్లు టీఆర్‌ఎస్‌ గెల్చుకునే అవకాశం ఉంది.. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఉన్న ఆరు డివిజన్లలో అధికార టీఆర్‌ఎస్‌కు బీజేపీ పోటీనిస్తోంది.. రెండు పార్టీలు కూడా జోరుగా ప్రచారం చేశాయి. కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో ఉన్న డివిజన్‌లలో కూడా గట్టిపోటీనే ఉంది.. మలక్‌పేట నియోజకవర్గంలో ఉన్న ఆరు డివిజన్‌లలో ఎక్కువ భాగం మజ్లిస్‌ గెల్చే అవకాశాలున్నాయి.. కొన్ని చోట్ల టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ ఉంది.. సనత్‌నగర్‌ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆరు డివిజన్‌లలో కూడా అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పోటీ ఉంది.. గోషామహల్‌ నియోజకవర్గంలో ఉన్న ఆరు డివిజన్‌లలోనూ అంతే.. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీతో బీజేపీ తలపడుతోంది.. బేగంబజార్‌ డివిజన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి వి.జి.పురుషోత్తమ్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పూజా వ్యాస్‌ బిలాల్‌కు మద్దతు ఇవ్వడంతో వాతావరణం టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారింది.. జాంబాగ్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌, బీజేపీ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి.. లాస్ట్‌ టైమ్‌ ఎలెక్షన్‌లో టీఆర్‌ఎస్‌ కేవలం అయిదు ఓట్లతో పరాజయంపాలైంది.. ఓటర్లలో ఆ సానుభూతి అయితే ఉంది.. అయితే పోలింగ్‌ బూత్‌లో ఎంతవరకు ప్రతిఫలిస్తుందో చూడాలి.. గన్‌ఫౌండ్రీ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ కొంచెం ముందు వుంది.. కారణం మొన్న జరిగిన కేసీఆర్‌ సభే.. ఆ సభ జరిగిన ఎల్‌బీ స్టేడియం గన్‌ఫౌండ్రీ డివిజన్‌లోనే ఉంది కాబట్టి.

సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో ఉన్న అయిదు డివిజన్‌లలో టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్యనే పోటీ ఉంది.. ఇక్కడ బస్తీల ఓట్లు కీలకంగా మారబోతున్నాయి.. కేటీఆర్‌ రోడ్‌షోలతో వాతావరణం ఒక్కసారిగా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారింది..కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో ఉన్న మొత్తం ఎనిమిది డివిజన్‌లలో కూడా టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పోటీ ఉంది.. కొన్ని చోట్ల ముక్కోణపు పోటీ కూడా ఉంది.. ఒకటి రెండు డివిజన్‌లలో టీఆర్‌ఎస్‌ గెలుపు సునాయసమేననిపిస్తోంది.. అంబర్‌పేట నియోజకవర్గంలో అయిదు డివిజన్‌లు ఉన్నాయి.. ఈ అయిదింటిలోనూ అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్యనే పోటీ ఉంది.. కాంగ్రెస్‌ కూడా మూడు చోట్ల పోటీలో ఉంది.. నల్లకుంట, గోల్నాక డివిజన్‌లలో గెలుపు అవకాశం టీఆర్‌ఎస్‌కే ఉన్నప్పటికీ ఉత్తరభారతీయులపై బీజేపీ ఆశలు పెట్టుకుంది.. కార్వాన్‌ నియోజకవర్గానికి చెందిన ఆరు డివిజన్‌లలో మజ్లిస్‌ అభ్యర్థులకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. లంగర్‌హౌజ్‌లో మాత్రం మజ్లిస్‌, బీజేపీ మధ్య పోటీ ఉంది.. ఉప్పల్‌ నియోజకవర్గంలో పది డివిజన్‌లు ఉన్నాయి.. కాప్రా డివిజన్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీలు పోటీపడుతుండగా, ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ నుంచి గట్టి పోటీ ఉంది. చర్లపల్లి డివిజన్‌లో గతంలో గెలిచి మేయర్‌ అయిన బొంతు రామ్మోహన్‌ భార్య ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ నుంచి పోటీలో ఉన్నారు. మీర్‌పేట–హెచ్‌బీకాలనీ డివిజన్‌లో టీఆర్‌ఎస్, బీజేపీల మధ్యే పోటీ ఉంది. మల్లాపూర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాచారం డివిజన్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. చిలుకానగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పోటీ నడుస్తోంది. హబ్సిగూడ డివిజన్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. రామంతాపూర్‌ డివిజన్‌లో కూడా అంతే.. ఇక్కడా ముక్కోణపు పోటీ ఉంది..

ఉప్పల్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ ఉంది. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ఉన్న ఆరు డివిజన్‌లలో అయిదు డివిజన్‌లలో టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య పోటీ ఉంది. భోలక్‌పూర్‌లో మాత్రం మజ్లిస్‌, టీఆర్‌ఎస్‌ మధ్య పోటీ ఉంది.. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ముస్లిం, క్రిస్టియన్‌లు ఎక్కువ.. వీరంతా టీఆర్‌ఎస్‌కే ఓటు వేసే అవకాశం ఉంది.. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలో ఉన్న అయిదు డివిజన్‌లలో ఎక్కువ మట్టుకు మజ్లిస్‌ పార్టీ ముందంజలో ఉంది.. ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో ఉన్న 11 డివిజన్లలో పోటీ గట్టిగానే ఉంది. ఎవరు గెలుస్తారో చెప్పలేకపోతున్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఉన్న ఆరు డివిజన్‌లలోనూ టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. మజ్లిస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్న పాతబస్తీలోని నాలుగు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులే సత్తా చాటనున్నారు. చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా తదితర నాలుగు నియోజకవర్గాల పరిధిలోని 24 డివిజన్లలో మజ్లిస్‌ పార్టీ అభ్యర్థులు మొదటి స్థానంలో ఉన్నారు. మల్కాజిగిరి డివిజన్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంది.

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..