కొత్త జీవితానికి శ్రీకారం చుట్టనున్న సింగర్ సునీత.. జనవరిలో పెళ్లిపీటలెక్కే అవకాశం
గత కొంతకాలంగా సింగర్ సునీత పెళ్లివార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే . తన మధురమైన గాత్రంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సునీత త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.
గత కొంతకాలంగా సింగర్ సునీత పెళ్లివార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే . తన మధురమైన గాత్రంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సునీత త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సునీత పెళ్లివార్తలు నిజమే అని తెలుస్తుంది. డిజిటల్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న బిజినెస్ మెన్ రామ్ వీరపనేనితో సునీత నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇప్పటికే పెళ్ళికి సంబంధించి ఇరుకుటుంబసభ్యులు మాట్లాడుకొని ముహూర్తం కూడా ఫిక్స్ చేసారని తెలుస్తుంది. జనవరిలో పెళ్లి జరిగే అవకాశం ఉందని సమాచారం. సునీతకు 19 ఏళ్ల ప్రాయంలోనే వివాహం జరిగింది. చిన్న వయసులోనే ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యారు.. భర్త పట్టించుకోకపోవడంతో కుటుంబబాధ్యతలను తన పై వేసుకున్నారు సునీత . ఆతర్వాత మనస్పర్థల కారణంగా భర్తతో విడాకులు తీసుకొని పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. తాజాగా రెండో పెళ్లితో సునీత కొత్త జీవితంలోకి అడుగు పెట్టనున్నారు.