రాజీవ్ గాంధీ తరహాలో మోదీ హత్యకు కుట్ర…!

|

Dec 21, 2019 | 5:03 PM

నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తరహాలో నేటి ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్రలు జరుగుతున్నాయన్న సంచలన విషయాలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయ్యాయి. ఈ నిజాలన్నింటిని ఎల్గార్ పరిషత్ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్‌లో మహారాష్ట్ర పోలీసులు పొందుపరిచారు. మావోయిస్టులు మోదీ హత్యకు కుట్ర పన్నుతున్నారని.. దాని వెనుక హక్కుల నేతల హస్తం ఉందని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి 9 మంది హక్కుల నేతలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో తెలుగు […]

రాజీవ్ గాంధీ తరహాలో మోదీ హత్యకు కుట్ర...!
Follow us on

నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తరహాలో నేటి ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్రలు జరుగుతున్నాయన్న సంచలన విషయాలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయ్యాయి. ఈ నిజాలన్నింటిని ఎల్గార్ పరిషత్ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్‌లో మహారాష్ట్ర పోలీసులు పొందుపరిచారు. మావోయిస్టులు మోదీ హత్యకు కుట్ర పన్నుతున్నారని.. దాని వెనుక హక్కుల నేతల హస్తం ఉందని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి 9 మంది హక్కుల నేతలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో తెలుగు విప్లవ రచయిత వరవరరావు, సుధీర్‌ ధవాళే, రోనా విల్సన్‌, సురేంద్ర గాడ్లింగ్‌, మహేశ్‌ రౌత్‌, షోమా సేన్‌, అరుణ్‌ ఫెరీరా, వెర్మన్‌ గోంసాల్వెస్‌, సుధా భరద్వాజ్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) మేరకు పోలీసులు శుక్రవారం పుణెలోని ప్రత్యేక కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. శ్రీ పెరంబదూర్‌లో రాజీవ్ గాంధీని హత్య చేసిన విధంగా రోడ్ షోలో మోదీని హతమార్చాలని వీరు కుట్ర పన్నినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం 8 కోట్లు విలువ జేసే ఎం4 రైఫిల్‌ను, 4 లక్షల రౌండ్ల మందుగుండు మారణాయుధాలను ఓ సప్లయియర్ మణిపూర్ మీదుగా తీసుకురావడానికి యత్నించారని ఛార్జ్ షీట్‌లో ఆరోపించారు.

కాగా, 2017 డిసెంబర్ 31న భీమా కోరెగాం ప్రాంతంలో ఎల్గార్ పరిషత్ సమావేశాన్ని మావోయిస్టులే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సమావేశం అనంతరం జరిగిన భారీ సభలో రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు, హింస చెలరేగడం వెనుక హక్కుల నేతలే ఉన్నారని పోలీసులు ఆరోపించారు. ఇక దీనికి సంబంధించి ఛార్జ్ షీటును పోలీసులు దాదాపు రెండేళ్ల తర్వాత దాఖలు చేశారు. ఇది కాస్తా సంచలనమైంది.