దుబ్బాక ఉపఎన్నికలో పోటీచేస్తానంటోన్న సిద్దిపేట కలెక్టర్.!

దుబ్బాక ఉప ఎన్నికలు కొత్త టర్న్ తీసుకున్నాయి. సిద్దిపేట కలెక్టర్ వెంకట్ రాంరెడ్డి రంగంలోకి దిగి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన టీవీ9 తో మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నాని తెలిపారు. తనను దుబ్బాకలో పోటీ చేయాలని చాలా మంది ప్రజలు, వేల సంఖ్యలో మెసేజ్ లు చేస్తున్నారని చెప్పారు. అయితే, తనకు టిఆర్ఎస్ పార్టీ నుండి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని.. ఒకవేళ అవకాశం వస్తే పోటీలో ఉంటా.. ప్రజా […]

దుబ్బాక ఉపఎన్నికలో పోటీచేస్తానంటోన్న సిద్దిపేట కలెక్టర్.!

Updated on: Oct 04, 2020 | 10:39 AM

దుబ్బాక ఉప ఎన్నికలు కొత్త టర్న్ తీసుకున్నాయి. సిద్దిపేట కలెక్టర్ వెంకట్ రాంరెడ్డి రంగంలోకి దిగి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన టీవీ9 తో మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నాని తెలిపారు. తనను దుబ్బాకలో పోటీ చేయాలని చాలా మంది ప్రజలు, వేల సంఖ్యలో మెసేజ్ లు చేస్తున్నారని చెప్పారు. అయితే, తనకు టిఆర్ఎస్ పార్టీ నుండి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని.. ఒకవేళ అవకాశం వస్తే పోటీలో ఉంటా.. ప్రజా సేవ చేస్తా… అని కలెక్టర్ వెంకట్ రాంరెడ్డి పేర్కొన్నారు. ‘బాహుశా నా పనితనం మెచ్చే నన్ను ప్రజలు కోరుకుంటున్నారు కావొచ్చు’ అని రాంరెడ్డి అన్నారు.