స్కూల్స్ మూత.. భారత్‌కు లక్షల కోట్లు నష్టం.. 55 లక్షల మంది చదువుకు దూరం..

మాయదారి కరోనా వైరస్ భారత విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా పాఠశాలలను సుదీర్ఘంగా మూసి ఉంచడం వల్ల భారత్‌కు...

స్కూల్స్ మూత.. భారత్‌కు లక్షల కోట్లు నష్టం.. 55 లక్షల మంది చదువుకు దూరం..

Updated on: Oct 13, 2020 | 11:41 AM

Shutting Schools Over Covid: మాయదారి కరోనా వైరస్ భారత విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా పాఠశాలలను సుదీర్ఘంగా మూసి ఉంచడం వల్ల భారత్‌కు 400 బిలియన్ డాలర్ల(దాదాపుగా రూ.29 లక్షల కోట్లు) నష్టం వాటిల్లుతుందని ప్రపంచ బ్యాంక్ తాజాగా ఓ నివేదికలో తెలిపింది. అలాగే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పాఠశాలలు మూతపడటంతో దక్షిణాసియాలో సుమారు 622 బిలియన్ డాలర్ల నుంచి 880 బిలియన్ డాలర్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేసింది.

మరోవైపు ఈ కరోనా రక్కసి కారణంగా భారతదేశంలో సుమారు 55 లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరం కాగా.. మొత్తం దక్షిణాసియా దేశాల్లో 391 మిలియన్ విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. అంతేకాకుండా ఆరు నెలలకు పైగా పిల్లలు బడులకు దూరంగా ఉండటం వల్ల వారిలో చదవాలన్న, నేర్చుకోవాలన్న ఆసక్తి తగ్గిందని నివేదికలో పేర్కొంది. కరోనా కారణంగా దక్షిణాసియా దేశాల్లో పాఠశాలలు మూతపడటం వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థపై ఎలాంటి భారం పడుతుంది.? అలాగే విద్యార్థులకు ఎదురయ్యే అభ్యసన నష్టాలు ఏంటి.? అనే అంశాలపై ‘బీటెన్ ఆర్ బ్రోకెన్’ పేరిట ప్రపంచ బ్యాంక్ ఓ నివేదికను రిలీజ్ చేసింది.

కోవిడ్ లాక్‌డౌన్‌లో అభ్యసన నష్టాలను అంచనా వేసేందుకు లెర్నింగ్‌-అడ్జెస్టెడ్‌ ఇయర్స్‌ ఇఫ్‌ స్కూలింగ్‌(LAYS) కాన్సెప్ట్‌ను ప్రపంచ బ్యాంక్ తెరపైకి తీసుకొచ్చింది. ఆ సమయంలో 0.5(LAYS) నష్టం వచ్చినట్లు తేలింది. దీంతో ప్రస్తుతం ఉన్న 6.5(LAYS).. 6.0(LAYS)కు పడిపోతోందని ప్రపంచబ్యాంక్‌ తన నివేదికలో పేర్కొంది. కాగా, పాఠశాలలు మరికొంత కాలం ఇలాగే మూసి ఉంచితే దేశ భవిష్యత్ ఆదాయంపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది.

Follow Us