AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కూల్స్ మూత.. భారత్‌కు లక్షల కోట్లు నష్టం.. 55 లక్షల మంది చదువుకు దూరం..

మాయదారి కరోనా వైరస్ భారత విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా పాఠశాలలను సుదీర్ఘంగా మూసి ఉంచడం వల్ల భారత్‌కు...

స్కూల్స్ మూత.. భారత్‌కు లక్షల కోట్లు నష్టం.. 55 లక్షల మంది చదువుకు దూరం..
Ravi Kiran
|

Updated on: Oct 13, 2020 | 11:41 AM

Share

Shutting Schools Over Covid: మాయదారి కరోనా వైరస్ భారత విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా పాఠశాలలను సుదీర్ఘంగా మూసి ఉంచడం వల్ల భారత్‌కు 400 బిలియన్ డాలర్ల(దాదాపుగా రూ.29 లక్షల కోట్లు) నష్టం వాటిల్లుతుందని ప్రపంచ బ్యాంక్ తాజాగా ఓ నివేదికలో తెలిపింది. అలాగే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పాఠశాలలు మూతపడటంతో దక్షిణాసియాలో సుమారు 622 బిలియన్ డాలర్ల నుంచి 880 బిలియన్ డాలర్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేసింది.

మరోవైపు ఈ కరోనా రక్కసి కారణంగా భారతదేశంలో సుమారు 55 లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరం కాగా.. మొత్తం దక్షిణాసియా దేశాల్లో 391 మిలియన్ విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. అంతేకాకుండా ఆరు నెలలకు పైగా పిల్లలు బడులకు దూరంగా ఉండటం వల్ల వారిలో చదవాలన్న, నేర్చుకోవాలన్న ఆసక్తి తగ్గిందని నివేదికలో పేర్కొంది. కరోనా కారణంగా దక్షిణాసియా దేశాల్లో పాఠశాలలు మూతపడటం వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థపై ఎలాంటి భారం పడుతుంది.? అలాగే విద్యార్థులకు ఎదురయ్యే అభ్యసన నష్టాలు ఏంటి.? అనే అంశాలపై ‘బీటెన్ ఆర్ బ్రోకెన్’ పేరిట ప్రపంచ బ్యాంక్ ఓ నివేదికను రిలీజ్ చేసింది.

కోవిడ్ లాక్‌డౌన్‌లో అభ్యసన నష్టాలను అంచనా వేసేందుకు లెర్నింగ్‌-అడ్జెస్టెడ్‌ ఇయర్స్‌ ఇఫ్‌ స్కూలింగ్‌(LAYS) కాన్సెప్ట్‌ను ప్రపంచ బ్యాంక్ తెరపైకి తీసుకొచ్చింది. ఆ సమయంలో 0.5(LAYS) నష్టం వచ్చినట్లు తేలింది. దీంతో ప్రస్తుతం ఉన్న 6.5(LAYS).. 6.0(LAYS)కు పడిపోతోందని ప్రపంచబ్యాంక్‌ తన నివేదికలో పేర్కొంది. కాగా, పాఠశాలలు మరికొంత కాలం ఇలాగే మూసి ఉంచితే దేశ భవిష్యత్ ఆదాయంపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది.

Follow Us
టాలీవుడ్ ఆఫర్స్ కోసం ఈగర్‌గా ఎదురుచూస్తున్న లవ్ టుడే భామ
టాలీవుడ్ ఆఫర్స్ కోసం ఈగర్‌గా ఎదురుచూస్తున్న లవ్ టుడే భామ
మహిళలకు ప్రతీ నెలా రూ.2,500.. అమలు దిశగా ప్రభుత్వం
మహిళలకు ప్రతీ నెలా రూ.2,500.. అమలు దిశగా ప్రభుత్వం
రోహిత్ శర్మ ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేసిన హార్దిక్ పాండ్యా..
రోహిత్ శర్మ ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేసిన హార్దిక్ పాండ్యా..
జుట్టు, గోళ్లు కత్తిరించేటప్పుడు నొప్పి ఎందుకు రాదు?
జుట్టు, గోళ్లు కత్తిరించేటప్పుడు నొప్పి ఎందుకు రాదు?
పెళ్లి రోజు వర్షం పడటం శుభమా? అశుభమా?
పెళ్లి రోజు వర్షం పడటం శుభమా? అశుభమా?
వాస్తు టిప్స్ : కొబ్బరి, మామిడి చెట్లు.. ఏ దిక్కులో ఉండాలో తెలుసా
వాస్తు టిప్స్ : కొబ్బరి, మామిడి చెట్లు.. ఏ దిక్కులో ఉండాలో తెలుసా
మీ ఫోన్ ను 100 పర్సెంట్ ఛార్జింగ్ చేస్తున్నారా?.. ఈ రిస్క్ తప్పదు
మీ ఫోన్ ను 100 పర్సెంట్ ఛార్జింగ్ చేస్తున్నారా?.. ఈ రిస్క్ తప్పదు
పక్షుల్లాగే గూడు కట్టుకునే ఏకైక పాము ఇదే.. కారణం తెలిస్తే షాకే
పక్షుల్లాగే గూడు కట్టుకునే ఏకైక పాము ఇదే.. కారణం తెలిస్తే షాకే
ఈ క్యాబ్ డ్రైవర్ నెల జీతం తెలిస్తే షాకే.. నెట్టింట రచ్చ రచ్చ
ఈ క్యాబ్ డ్రైవర్ నెల జీతం తెలిస్తే షాకే.. నెట్టింట రచ్చ రచ్చ
లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకున్నారా.? ఇలా చేస్తే ఒక్క రూపాయ్
లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకున్నారా.? ఇలా చేస్తే ఒక్క రూపాయ్