Shri Krishna Janmashtami: అల్లరి కష్ణుడికి ఇష్టమైన వంటకాలేంటో తెలుసా..?

| Edited By:

Aug 23, 2019 | 11:08 AM

అల్లరి కృష్ణుడు, కొంటె కృష్ణుడు, వెన్న దొంగ, వెన్న గోపాలుడిగా.. పలు రకాల పేర్లతో శ్రీ కృష్ణుడిని మనం పిలుస్తూ ఉంటాం. చెడును అంతమొందించి.. మంచిని పెంచేందుకు శ్రీకృష్ణుడు అవతరించాడు. అప్పట్లో.. ఆయన తిరిగాడిన స్థలాన్ని ద్వారకా అని పిలుస్తూండేవారు. ఆ ఊరికి.. ఆ ఊరిలోని ప్రజలకు చిన్న కష్టమొచ్చిన నల్లయ్య ముందుండేవాడు. తన అల్లరి చేష్టలతో.. విసుగుపుట్టించినా.. ఆ చిలిపి కృష్ణుడంటే.. వయసులో ఉన్న ఆడపిల్లలకు.. పెద్దవాళ్లుకు.. చిన్నవాళ్లకు సైతం అందరికీ ఇష్టమే. మరి.. ఆ […]

Shri Krishna Janmashtami: అల్లరి కష్ణుడికి ఇష్టమైన వంటకాలేంటో తెలుసా..?
Follow us on

అల్లరి కృష్ణుడు, కొంటె కృష్ణుడు, వెన్న దొంగ, వెన్న గోపాలుడిగా.. పలు రకాల పేర్లతో శ్రీ కృష్ణుడిని మనం పిలుస్తూ ఉంటాం. చెడును అంతమొందించి.. మంచిని పెంచేందుకు శ్రీకృష్ణుడు అవతరించాడు. అప్పట్లో.. ఆయన తిరిగాడిన స్థలాన్ని ద్వారకా అని పిలుస్తూండేవారు. ఆ ఊరికి.. ఆ ఊరిలోని ప్రజలకు చిన్న కష్టమొచ్చిన నల్లయ్య ముందుండేవాడు. తన అల్లరి చేష్టలతో.. విసుగుపుట్టించినా.. ఆ చిలిపి కృష్ణుడంటే.. వయసులో ఉన్న ఆడపిల్లలకు.. పెద్దవాళ్లుకు.. చిన్నవాళ్లకు సైతం అందరికీ ఇష్టమే.

మరి.. ఆ అల్లరి కృష్డుడు అవతరించిన రోజే.. శ్రీ కృష్ణాష్టమి జరుపుకుంటాం. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు కూడా చేస్తూంటారు. అప్పుడు పెట్టే నైవేద్యాలంటే ఆయనకు చాలా ఇష్టం. అలాంటిది ఆయనకు నచ్చే నైవేద్యం పెడితే… ఇంకెంత ఇష్టపడతాడో కదా.. మరి ఆ నల్లయ్యకు నచ్చే నైవేద్యాలేంటో తెలుసుకుందామా..!

వెన్న:

‘వెన్నదొంగ’ అని కృష్ణుడిని ఎలాగో పిలుస్తూంటారు. అంత ఇష్టం ఆయనకి వెన్నంటే.. కృష్ణాష్టమి రోజు ఆయనకు వెన్న నైవేథ్యం పెడితే.. అడిగింది వెంటనే ఇస్తాడని.. భక్తుల విశ్వాసం.

మోతీచూర్ లడ్డూలు:

మోతీచూర్ లడ్డూలన్నా కృష్ణుడికి ఇష్టమట. చిన్నతనంలో ఉన్నప్పుడు వాటిని ఇష్టంగా లాగించేసేవాడని మనందరికీ తెలిసిందే కదా.

పాయసం:

శ్రీ కృష్ణాష్టమి రోజు లడ్డూలు, వెన్నతో పాటుగా పాయసం కూడా తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఆయనకు పాయసమంటే ప్రాణం. ఎంతిచ్చినా ఆరగించేస్తాడు.

పంచామృతం:

కృష్ణ భగవానుడికి పాలు, పెరుగు, తేనే, జీడిపప్పులు ఇలాంటివంటే చాలా ఇష్టం వాటితో పంచామృతం చేసి ఇస్తే.. అంతకు మించి ఏంకావాలి..

అటుకులు:

పంచామృతాలు కాదు.. పిడికెడు అటుకులు చాలు.. అంటాడు శ్రీకృష్ణుడు.. ఏమీ లేకపోయినా.. ఉన్నంతలో ఆయనకు అటుకులతో పులిహోర చేసిపెట్టినా.. ఎంతో ఇష్టం తింటాడు శ్రీకృష్ణుడు