హిందీ ‘ఆమె’లో శ్రద్దా కపూర్..!

హీరోయిన్ అమలాపాల్ తన కెరీర్‌లో చేసిన వైవిధ్యభరితమైన సినిమాల్లో ఒకటి 'ఆడై'. లేడి ఓరియంటెడ్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన 'ఆడై'లో అమలాపాల్ ఛాలెంజింగ్‌ రోల్‌లో నటించారు.

హిందీ ఆమెలో శ్రద్దా కపూర్..!

Updated on: Aug 15, 2020 | 5:48 PM

Shraddha Kapoor In Aadai Hindi Remake: హీరోయిన్ అమలాపాల్ తన కెరీర్‌లో చేసిన వైవిధ్యభరితమైన సినిమాల్లో ఒకటి ‘ఆడై’. లేడి ఓరియంటెడ్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ‘ఆడై’లో అమలాపాల్ ఛాలెంజింగ్‌ రోల్‌లో నటించారు. తెలుగులో ‘ఆమె’గా విడుదలైన ఈ చిత్రానికి రత్నకుమార్ దర్శకత్వం వహించాడు. గతేడాది రిలీజైన ఈ సినిమాకు మంచి మార్కులు పడ్డాయి.

ఇప్పుడు తాజాగా ఈ మూవీని బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారని టాక్. ఈ సినిమా హిందీ రీమేక్‌లో శ్రద్దా కపూర్ ప్రధాన పాత్ర పోషించనున్నారని సమాచారం. మరి ఒరిజినల్ వెర్షన్‌లో అమల చేసిన బోల్డ్ సీన్స్‌ను రీమేక్‌లో శ్రద్దా కపూర్ చేస్తారా.? అనే చూడాలి. బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Also Read:

దేశంలో డిసెంబర్ వరకు స్కూళ్ళు మూసివేత.. నిజమేనా.?