ఎయిర్‌పోర్టులో అక్రమ రవాణా.. బంగారం కాదు అదేంటో తెలిస్తే షాక్

| Edited By: Pardhasaradhi Peri

Oct 10, 2019 | 7:24 PM

స్మగ్లర్ల ఆగడాలకు హద్దు లేకుండా పోతుంది. నిన్నటి వరకు బంగారం, విదేశీ కరెన్సీ, డ్రగ్స్‌ను అక్రమ మార్గాల్లో తరలించిన ఘటనలు మరువక ముందే. మరికొంతమంది కేటుగాళ్లు ప్రమాదకరమైన విష సర్పాలను,ఉడుములను సైతం స్మగ్లింగ్ చేస్తున్నారు. చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో విష సర్పాల స్మగ్లింగ్ బాగోతం బట్టబయలైంది. గురువారం మలేసియా నుంచి చెన్నై విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరి వద్ద ఉన్న ప్లాస్టిక్ బాక్సులను ఓపెన్ చేయగానే తనిఖీ అధికారులు షాక్ అయ్యారు. ఆ బాక్సుల్లో భయంకరమైన […]

ఎయిర్‌పోర్టులో అక్రమ రవాణా.. బంగారం కాదు అదేంటో తెలిస్తే షాక్
Follow us on

స్మగ్లర్ల ఆగడాలకు హద్దు లేకుండా పోతుంది. నిన్నటి వరకు బంగారం, విదేశీ కరెన్సీ, డ్రగ్స్‌ను అక్రమ మార్గాల్లో తరలించిన ఘటనలు మరువక ముందే. మరికొంతమంది కేటుగాళ్లు ప్రమాదకరమైన విష సర్పాలను,ఉడుములను సైతం స్మగ్లింగ్ చేస్తున్నారు. చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో విష సర్పాల స్మగ్లింగ్ బాగోతం బట్టబయలైంది. గురువారం మలేసియా నుంచి చెన్నై విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరి వద్ద ఉన్న ప్లాస్టిక్ బాక్సులను ఓపెన్ చేయగానే తనిఖీ అధికారులు షాక్ అయ్యారు. ఆ బాక్సుల్లో భయంకరమైన 2 పాము పిల్లలు, 16 ఉడుములు ఉన్నాయి. వీటిని చెన్నై రామనాథంనురం ప్రాంతానికి చెందిన మహ్మద్(36), శివగంగేకు చెందిన మహ్మద్ అక్బర్ (26) అనే వ్యక్తులు పాము పిల్లలు, ఉడుములతో ఉన్న బాక్సులను అతి జాగ్రత్తగా తీసుకు వచ్చారు. తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చి తెరిచి చూడగా అసలు విషయం వెలుగుచూసింది.


నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విష సర్పాలు ఎందుకు ఇండియాకు తీసుకొచ్చారు? వీటితో ఏమి చేయదలుచుకున్నారు? ఎక్కడినుంచి వీటిని తెచ్చారు అని కూపీ లాగుతున్నారు. అయితే ఈ పాములను, ఉడుతలను తిరిగి మలేసియాకు పంపనున్నట్టు అధికారులు తెలిపారు.