అశ్వత్థామకు షోకాజ్ నోటీసులు జారీ..!

|

Feb 03, 2020 | 9:15 PM

Shock To RTC JAC Leader Ashwathama Reddy: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘకాలం చేపట్టిన సమ్మెకు సారధ్యం వహించిన జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సమ్మె అనంతరం లాంగ్ లీవ్ తీసుకున్న ఆయన.. నెలలు గడుస్తున్నా తిరిగి విధుల్లోకి చేరకపోవడంతో ఆర్టీసీ యాజమాన్యం షోకాజ్ నోటీసులను జారీ చేసింది. కాగా, సమ్మె ముగిసిన అనంతరం ఆర్నెల్లు సెలవు కావాలంటూ అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ ఉన్నతాధికారులను కోరిన సంగతి విదితమే. అయితే అధికారులు మాత్రం […]

అశ్వత్థామకు షోకాజ్ నోటీసులు జారీ..!
Follow us on

Shock To RTC JAC Leader Ashwathama Reddy: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘకాలం చేపట్టిన సమ్మెకు సారధ్యం వహించిన జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సమ్మె అనంతరం లాంగ్ లీవ్ తీసుకున్న ఆయన.. నెలలు గడుస్తున్నా తిరిగి విధుల్లోకి చేరకపోవడంతో ఆర్టీసీ యాజమాన్యం షోకాజ్ నోటీసులను జారీ చేసింది.

కాగా, సమ్మె ముగిసిన అనంతరం ఆర్నెల్లు సెలవు కావాలంటూ అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ ఉన్నతాధికారులను కోరిన సంగతి విదితమే. అయితే అధికారులు మాత్రం ఆయనకు షాక్ ఇస్తూ లీవ్‌ను సున్నితంగా తిరస్కరించారు. అయినా కూడా మరోసారి ఎక్స్‌ట్రా ఆర్టనరీ లీవ్‌ (ఈఓఎల్‌) కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఆ లీవ్ కూడా తిరస్కరణకు గురైంది.

సంస్థ ఆర్ధిక సంక్షోభంలో ఉందని.. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక సెలవులను ఇవ్వడం కుదరదని వెంటనే విధుల్లోకి తిరిగి చేరాలని అధికారులు ఆయన్ని సూచించారు. అయినప్పటికీ కూడా ఆయన విధుల్లోకి చేరకపోవడంతో షోకాజ్ నోటీసులు జారీ చేశారు.