నేవీ మాజీ అధికారి మదన్ శర్మపై శివసేన కార్యకర్తల దాడిని ఈ పార్టీ నేత సంజయ్ రౌత్ పరోక్షంగా సమర్థించారు. అసలు రెచ్ఛగొట్టిందని ఎవరని ఆయన ప్రశ్నించారు. విమర్శలు సహేతుకంగా ఉండాలని, తాము కూడా విమర్శలు చేస్తామని ఆయన చెప్పారు. నేవీ మాజీ అధికారిపై దాడి చేసినవారు శివసేన కార్యకర్తలేనని, ఆ విషయాన్ని తాము ఖండించడం లేదన్నారు. ప్రతి యాక్షన్ కీ రియాక్షన్ అంటూ ఉంటూ ఉంటుంది. . యూపీలో మాజీ సైనికుని కుటుంబంపై దాడి జరిగింది. కానీ యూపీ ప్రభుత్వం దాన్ని ఖండించలేదు అని రౌత్ చెప్పారు. ఆ ఘటనపై ఆ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసిందా అన్నారు. శివసేన కార్యకర్తలు ప్రీ-ప్లాన్ గా ఈ ఎటాక్ చేయలేదని ఆయన పేర్కొన్నారు.