Shradda Kapoor: పెళ్లికి సిద్ధమవుతోన్న ‘సాహో’ బ్యూటీ…? కూతురు పెళ్లిపై స్పందించిన శక్తి కపూర్..

Shakti Kapoor's Reaction On Shraddha Marriage: హీరోయిన్ల వివాహం విషయంలో ఎప్పుడూ ఏదో ఒక గాసిప్ నడుస్తూనే ఉంటుంది. పలానా హీరోయిన్, పలానా వ్యక్తితో ప్రేమలో ఉందంటా.. త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందంటా...

Shradda Kapoor: పెళ్లికి సిద్ధమవుతోన్న ‘సాహో’ బ్యూటీ...? కూతురు పెళ్లిపై స్పందించిన శక్తి కపూర్..

Updated on: Jan 28, 2021 | 4:31 PM

Shakti Kapoor’s Reaction On Shraddha Marriage: హీరోయిన్ల వివాహం విషయంలో ఎప్పుడూ ఏదో ఒక గాసిప్ నడుస్తూనే ఉంటుంది. పలానా హీరోయిన్, పలానా వ్యక్తితో ప్రేమలో ఉందంటా.. త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందంటా.. అంటూ గాసిప్స్ తెగ హల్‌చల్ చేస్తుంటాయి. తాజాగా ఇలాగే సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ పెళ్లి విషయంలోనూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది.


బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఇటీవలే చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహంపై ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ట శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టాడు. అయితే రోహన్ చేసిన పోస్ట్‌కు.. వరుణ్ ధావన్ స్పందిస్తూ.. త్వరలోనే నువ్వు కూడా పెళ్లికి రెడీ అవుతున్నావని ఆశిస్తున్నానని చెప్పాడు. దీంతో అతడు, హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ కూడా ఈ ఏడాది పెళ్లి చేసుకునే ఛాన్స్‌ ఉందంటూ వార్తలు ఊపందుకున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే నటి శ్రద్ధా కపూర్ చిన్ననాటి స్నేహితుడు రోహన్ శ్రేష్టతో గత కొన్ని రోజులుగా డేటింగ్‌లో ఉందంటూ వార్తలు వస్తున్నాయి.

 

మా అమ్మాయి ఎవరిని తీసుకొచ్చినా అంగీకరిస్తాను..

ఇదిలా ఉంటే తాజాగా శ్రద్ధా కపూర్ తండ్రి, శక్తి కపూర్ కూతురు వివాహంపై స్పందించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘నా కూతురు పెళ్లి గురించి ఎలాంటి చర్చ నడుస్తుందో నాకు తెలియదు. కానీ ఆమె తీసుకునే ప్రతీ నిర్ణయానికి నేను మద్దతిస్తాను. అది ఆమె పెళ్లి విషయమైనా సరే! రోహన్‌ శ్రేష్టనే కాదు ఎవరిని తీసుకొచ్చినా పెళ్లికి నేను అంగీకరిస్తాను. రోహన్‌ చాలా మంచి అబ్బాయి. అతడు చిన్నప్పటి నుంచే మా ఇంటికి తరచూ వస్తుండేవాడు. ఇప్పటివరకైతే శ్రద్ధా తన పెళ్లి గురించి నాకు ఏమీ చెప్పలేదు. వాళ్లింకా బాల్య స్నేహితులే అనుకంటున్నాను. ప్రేమలో ఉన్నారనైతేనే భావించడం లేదు’ అని చెప్పుకొచ్చాడు.

Also Read: Ghani Movie Update: వరుణ్ తేజ్ ‘గని’ వచ్చేది అప్పుడే.. అఫీషియల్‏గా ప్రకటించిన చిత్రయూనిట్..

Follow Us