Ghani Movie Update: వరుణ్ తేజ్ ‘గని’ వచ్చేది అప్పుడే.. అఫీషియల్‌గా ప్రకటించిన చిత్రయూనిట్..
యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా 'గని'. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. తాజాగా 'గని' సినిమా

యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘గని’. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. తాజాగా ‘గని’ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు యూనిట్ సభ్యులు. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. అందులో వరుణ్ బాక్సింగ్ రింగ్‍లో పంచులు కొడుతున్నట్లుగా కనిపించాడు వరుణ్. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే.. ఈ సినిమాలో వరుణ్ బాక్సార్‌గా కనిపించనున్నట్లుగా తెలుస్తోంది.
తాజాగా వరుణ్ తేజ్ ‘గని’ సినిమా జూలై 30న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు బాబీ మరియు సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు కీలక పాత్రలలో నటించనున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సయూ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుంది. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Entering the ring this July!?#GhaniOnJuly30th@nimmaupendra @SunielVShetty @saieemmanjrekar @IamJagguBhai @dir_kiran @RenaissanceMovi pic.twitter.com/0vlkmRh2uH
— Varun Tej Konidela ? (@IAmVarunTej) January 28, 2021