మధ్యప్రదేశ్‌లో కుండపోత వర్షాలు.. 14 మంది మృతి

|

Aug 31, 2020 | 4:32 PM

మధ్యప్రదేశ్‌లో భారీవర్షాలు అతలాకుతలం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కుండపోత వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వెల్లడించారు.

మధ్యప్రదేశ్‌లో కుండపోత వర్షాలు.. 14 మంది మృతి
Follow us on

మధ్యప్రదేశ్‌లో భారీవర్షాలు అతలాకుతలం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కుండపోత వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వెల్లడించారు. మరోవైపు వర్షాల తీవ్రత అధికంగా ఉన్న 12 జిల్లాల్లోని 454 గ్రామాలకు చెందిన 11,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. మరో 40 గ్రామాలకు చెందిన 1200 మందిని తరలించేందుకు యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపడుతున్నామన్నారు.

పరిస్థితులు అదుపు తప్పడంతో సహాయక చర్యల కోసం భారత వైమానిక దళానికి చెందిన మూడు హెలికాప్టర్లను కేంద్రం అందుబాటులో ఉంచింది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. వరదల్లో చిక్కుకున్న వారిని యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరో 24 గంటలపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇండోర్‌, ఉజ్జయిన్‌, షాజాపూర్‌, రత్లాం, దేవస్‌, అలిరాజ్‌పూర్‌, మాండసూర్‌, నీమచ్‌ ప్రాంతాల్లో అత్యధిక వర్ష సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చౌహాన్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు.