‘ఆ అమోనియం నైట్రేట్ కస్టమ్స్ శాఖ కంట్రోల్ లో ఉంది, చెన్నై అధికారులు

| Edited By: Pardhasaradhi Peri

Aug 06, 2020 | 7:12 PM

చెన్నై నగరం బయట సుమారు 700 టన్నుల అమోనియం నైట్రేట్ ఉందని, అది కస్టమ్స్ శాఖ అధికారుల కంట్రోల్ లో ఉందని చెన్నైలోని అధికారులు తెలిపారు. బాణాసంచా, ఎరువుల తయారీలో..

ఆ అమోనియం నైట్రేట్ కస్టమ్స్ శాఖ కంట్రోల్ లో ఉంది, చెన్నై అధికారులు
Follow us on

చెన్నై నగరం బయట సుమారు 700 టన్నుల అమోనియం నైట్రేట్ ఉందని, అది కస్టమ్స్ శాఖ అధికారుల కంట్రోల్ లో ఉందని చెన్నైలోని అధికారులు తెలిపారు. బాణాసంచా, ఎరువుల తయారీలో వినియోగించే ఈ కెమికల్….  ఫైర్ వర్క్స్ ని ..పెద్దఎత్తున ఉత్పత్తి చేసే శివకాశిలో  ఓ గ్రూపు కోసం ఉద్దేశించినదన్నారు. 2015 లో ఈ అమోనియం నైట్రేట్ ని చెన్నై పోర్టులో స్వాధీనం చేసుకున్నారని, మొత్తం 36 కంటెయినర్లు ఉన్నాయని వారు వెల్లడించారు. ఒక్కో కంటెయినర్ లో దాదాపు 20 టన్నుల అమోనియం నైట్రేట్ ఉందని, దీన్ని శ్రీ అమ్మాన్ కెమికల్స్ అనే సంస్థ అక్రమంగా దిగుమతి చేసుకుందని కస్టమ్స్ శాఖ అధికారి ఒకరు తెలిపారు. దీనిపై తాము కోర్టుకెక్కామని, కోర్టు గత ఏడాది నవంబరులో రూలింగ్ ఇవ్వడంతో త్వరలో  వేలం వేస్తామని ఆయన చెప్పారు.