ఆర్జేడీ నుంచి బయటకొచ్చేసిన రఘువంశ్‌ప్రసాద్‌

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రీయ జనతాదళ్‌కు పెద్ద షాకే తగిలింది.. సీనియర్‌ నేత రఘువంశ్‌ ప్రసాద్‌ పార్టీకి రాజీనామా చేశారు.

ఆర్జేడీ నుంచి బయటకొచ్చేసిన రఘువంశ్‌ప్రసాద్‌

Updated on: Sep 10, 2020 | 3:17 PM

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రీయ జనతాదళ్‌కు పెద్ద షాకే తగిలింది.. సీనియర్‌ నేత రఘువంశ్‌ ప్రసాద్‌ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్‌ లాలూ ప్రసాద్ యాదవ్‌కు పంపించారు.. పార్టీ నుంచి వైదొలగడానికి కారణాలను రాజీనామా లేఖలో చెప్పకపోయినా ఆయనెందుకు బయటకొచ్చారన్నది బహిరంగ రహస్యమే! చాలా కాలంగా తేజస్వీయాదవ్‌తో రఘువంశ్‌ ప్రసాద్‌కు పడటం లేదు.. ఎంతో సీనియర్‌ నేత అయిన రఘుంశ్‌ తేజస్వీ యాదవ్‌ పెత్తనాన్ని సహించలేకపోయారు. పార్టీలో ఉక్కపోత భరించలేకే బయటకొచ్చారు.. త్వరలో ఆయన ఎన్‌డీఏ కూటమిలో చేరవచ్చు.. అసెంబ్లీ ఎన్నికల ముందు సీనియర్‌ నేత పార్టీకి రాజీనామా చేయడం ఆర్‌జేడీకి ఓ రకంగా పెద్ద దెబ్బే! మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో రఘువంశ్‌ ప్రసాద్‌ కేంద్ర మంత్రిగా పని చేశారు.. అలాగే యూపీఏ ప్రభుత్వం వేసిన తెలంగాణ కమిటీలో ఈయన సభ్యుడిగా ఉన్నారు.. రాష్ట్రీయ జనతాదళ్‌లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తర్వాత సీనియర్‌ నాయకుడు రఘువంశ్‌ ప్రసాదే కావడం గమనార్హం..