నా భార్యే నన్ను ఇబ్బంది పెట్టేది: తనకు పిల్లలు లేరని..!

| Edited By:

Aug 07, 2019 | 1:35 PM

సీరియల్ నటుడు మధు ప్రకాష్ భార్య భారతి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నటుడు మధు ప్రకాష్ స్పందిస్తూ.. భారతి మానసికంగా డిప్రెషన్‌కు గురైందని.. అందుకే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు. పిల్లలు లేకపోవడంతో మానసికంగా బాధపడేదని చెప్పారు. అలాగే.. నన్ను కూడా చాలా ఇబ్బందులకు గురి చేసేది.. షూటింగ్‌ల కారణంగా తాను ఆలస్యంగా ఇంటికి చేరుకోవడంతో.. గొడవ పడేదని అన్నారు. కాగా.. గతంలోనూ పలుమార్లు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేదని తెలిపారు. […]

నా భార్యే నన్ను ఇబ్బంది పెట్టేది: తనకు పిల్లలు లేరని..!
Follow us on

సీరియల్ నటుడు మధు ప్రకాష్ భార్య భారతి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నటుడు మధు ప్రకాష్ స్పందిస్తూ.. భారతి మానసికంగా డిప్రెషన్‌కు గురైందని.. అందుకే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు. పిల్లలు లేకపోవడంతో మానసికంగా బాధపడేదని చెప్పారు. అలాగే.. నన్ను కూడా చాలా ఇబ్బందులకు గురి చేసేది.. షూటింగ్‌ల కారణంగా తాను ఆలస్యంగా ఇంటికి చేరుకోవడంతో.. గొడవ పడేదని అన్నారు. కాగా.. గతంలోనూ పలుమార్లు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేదని తెలిపారు. అలాగే.. నిన్న మధ్యాహ్నం కూడా ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటాని చెప్పడంతో.. ఇంటికి వచ్చి మాట్లాడతానని చెప్పారు. రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చి బెడ్‌రూమ్ తలుపు ఎన్నిసార్లు కొట్టినా తలుపు తీయకపోవడంతో.. మాస్టర్ కీ సహాయంతో.. డోర్‌ ఓపెన్ చేశానని.. అప్పటికే తాను ఫ్యాన్‌కి ఉరేసుకుని ఉందని తెలిపారు. దీంతో.. తాను చాలా భయపడ్డానని.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చినట్టు చెప్పారు నటుడు మధుప్రకాష్.