ఆధిక్యంలో ఎన్డీఏ… దూసుకెళ్తున్న బుల్

| Edited By:

May 23, 2019 | 11:19 AM

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ లీడింగ్‌లో ఉండటంతో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్‌లో ఎన్‌డీఏ డబుల్ సెంచరీ దాటెయ్యడం, అందులో బీజేపీనే 200 పైగా సీట్ల ఆధిక్యంలో ఉండటంతో స్టాక్ మార్కెట్లు భారీగా లాభాపడ్డాయి. ఓపెనింగ్‌లోనే సెన్సెక్స్ 539.05 పైగా పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 156 పైగా పాయింట్లు దూసుకెళ్లింది. సరిగ్గా ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్లలో ఎన్డీఏ ఆధిక్యం కనబర్చింది. పోస్టల్ […]

ఆధిక్యంలో ఎన్డీఏ... దూసుకెళ్తున్న బుల్
Follow us on

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ లీడింగ్‌లో ఉండటంతో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్‌లో ఎన్‌డీఏ డబుల్ సెంచరీ దాటెయ్యడం, అందులో బీజేపీనే 200 పైగా సీట్ల ఆధిక్యంలో ఉండటంతో స్టాక్ మార్కెట్లు భారీగా లాభాపడ్డాయి. ఓపెనింగ్‌లోనే సెన్సెక్స్ 539.05 పైగా పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 156 పైగా పాయింట్లు దూసుకెళ్లింది.

సరిగ్గా ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్లలో ఎన్డీఏ ఆధిక్యం కనబర్చింది. పోస్టల్ బ్యాలెట్‌లో ఎన్డీఏ దూసుకెళ్తుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. స్టాక్ మార్కెట్ ప్రారంభమయ్యే సమయానికి ఎన్డీఏ 250 పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 200 పైగా స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. దీంతో ఉదయం 9.15 గంటలకు స్టాక్ మార్కెట్ ప్రారంభం కాగానే సెన్సెక్స్, నిఫ్టీ దూసుకెళ్లాయి. నిఫ్టీ ఈ రోజు 12,000 మార్క్‌ను దాటొచ్చని అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు.

కాగా, ఎగ్జిట్ ఫలితాల రోజున ఎన్డీఏకు స్పష్టమైన ఆధిక్యం రావడంతో మరుసటి రోజు స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్లు, నిఫ్టీ 421 పాయింట్లు దూసుకెళ్లాయి. మళ్లీ మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలకే ఆవిధంగా దూకుడు చూపిన ఇన్వెస్టర్లు, ఇప్పుడు కౌంటింగ్‌లో ఎన్డీఏ లీడింగ్‌లో ఉండటంతో అంతే దూకుడు చూపించారు. మరోవైపు రూపాయి విలువ కూడా బలపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 21 పైసలు బలపడింది. గురువారం 69.66 దగ్గర ముగిసిన రూపాయి ప్రస్తుతం 69.45 దగ్గర కొనసాగుతోంది.