తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా పలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ ఎన్‌బి చక్రవర్తి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్న ఆయన ఈ రోజు ఉదయం కన్నుమూశారు. తెలుగులో అనేక హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు ఎన్‌బి చక్రవర్తి. ”సంపూర్ణ రామాయణం, కత్తుల కొండయ్య, నిప్పులాంటి మనిషి, కాష్మోరా” వంటి ప్రముఖ చిత్రాలను ఆయన తెలుగులో తెరకెక్కించారు. కాగా సీనియర్ డైరెక్టర్ ఎన్‌బి చక్రవర్తి మృతి పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
దర్శకుడు ఎన్ బి చక్రవర్తి నేడు ఉదయం అనారోగ్యం తో కన్నుమూశారు.
ఆయన శోభన్ బాబు గారితో ‘సంపూర్ణ ప్రేమాయణం’, నందమూరి బాలకృష్ణ తో ‘కత్తుల కొండయ్య’, ‘నిప్పులాంటి మనిషి’, రాజేంద్రప్రసాద్, రాజశేఖర్ లతో ‘కాష్మోరా’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. pic.twitter.com/BHGnfcRkNa
— BARaju (@baraju_SuperHit) August 7, 2020
Read More:
మరో ప్రముఖ నటి సూసైడ్, కలకలం రేపుతోన్న ఆత్మహత్యలు!
ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు సతీమణి మృతి
కొత్తగా 13 మంది సబ్ కలెక్టర్‌లను నియమించిన ఏపీ ప్రభుత్వం
మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్‌పై అసభ్యకర పోస్ట్, వ్యక్తి అరెస్ట్