బాలయ్య సినిమాలో రాజశేఖర్​..కానీ కండీషన్స్ అప్లై..ఏ పాత్ర వేస్తున్నారంటే ?

|

Nov 15, 2020 | 11:57 AM

వరుస డిజాస్టర్ల తరువాత బోయపాటి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నారు. గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు...

బాలయ్య సినిమాలో రాజశేఖర్​..కానీ కండీషన్స్ అప్లై..ఏ పాత్ర వేస్తున్నారంటే ?
Follow us on

వరుస డిజాస్టర్ల తరువాత బోయపాటి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నారు. గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు సూపర్‌ హిట్‌ కావటంతో వీరిద్దరి కలియికలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే రోజురోజుకు మూవీ నుంచి వస్తోన్న ఓ కొత్త అప్‌డేట్ సినిమాపై మరింత బజ్ పెంచుతున్నాయి. తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ మూవీలో ప్రతినాయకుడి పాత్రలో సీనియర్​ హీరో రాజశేఖర్​ నటిస్తున్నారని సమాచారం అందుతోంది. అయితే, ఆయన పాత్ర కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితం అవుతోందట. ఇటీవల రాజశేఖర్ కరోనా బారినపడి  కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

ఈ సినిమాలో ‘అఖిల్’ ఫేం సాయేషా సైగల్​, పూర్ణ.. బాలయ్య సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో మరో నందమూరి హీరో తారకరత్న నటిస్తున్నారని సమాచారం. నెగిటివ్​ షేడ్స్​ ఉన్న ఓ రాజకీయ నాయకుడిగా ఆయన కనిపించనున్నారట. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిరియాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు.  ఒకటి అఘోరా పాత్ర కాగా, మరోకటి శక్తివంతమైన మాస్ పాత్రని ప్రచారం జరుగుతోంది.  తమన్ సంగీతం అందిస్తుండగా… మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది.

Also Read :

పాక్ దౌత్యాధికారికి భారత్ సమన్లు, సరిహద్దులో కాల్పుల విరమణకు తూట్లు పొడవడంపై ఆగ్రహం

పిఠాపురంలో అగ్నిప్రమాదం..తారాజువ్వ పడి కోళ్ల ఫారం‌ దగ్ధం, అగ్నికి ఆహుతైన 1200 కోళ్లు

ఆస్తి పన్ను రాయితీ ఉత్తర్వులు జారీ, ఇప్పటికే చెల్లించిన వారికి వచ్చే ఏడాది సర్దుబాటు