యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టామినా ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డాన్స్ తో నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు తారక్. ఎన్టీఆర్ మనవడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తారక్. తనదైన నటనతో డాన్స్ లతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఎన్టీఆర్ ను కళ్ళతోనే హావభావాలను పలికించగల నటుడు అని కొనియాడుతుంటారు దర్శకులు. ఇక ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎన్టీఆర్ ఎప్పుడు నేను బడా హీరోను అని డాబులు పోలేదు. ఎంత స్టార్ హీరో అయినా చాలా డౌన్ టు ఎర్త్ గా ఉంటాడు. అభిమానులతోనైనా తోటి నటులతో నైనా చాలా స్నేహభావంతో ఉంటాడు. అలాంటి తారక్ ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాళ్ళు పట్టుకున్నాడట.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధా అందరికి పరిచయం ఉండే ఉంటారు. ఎన్నో వందలాది సినిమాల్లో ఆమె నటించి మెప్పించారు అమ్మ , వదిన పాత్రల్లో ఎంతో చక్కగా నటించి మెప్పించారు సుధా. అయితే ఆమె తారక్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి చక్కర్లు కొడుతున్నాయి.
ఎన్టీఆర్ తో నటించేటప్పుడు జరిగిన ఓ ఇన్సిడెట్ ను ఆమె గుర్తు చేసుకున్నారు. బాద్షా సినిమా చేస్తున్న సమయంలో ఆడవాళ్ళతో కలిసి ఎన్టీఆర్ డాన్స్ చేసే సీన్ ఉంటుంది. ఆ సీన్ లో సుధాతో కలిసి డాన్స్ చేశారు. అయితే ఆ సమయంలో ఆమె కాలు స్లిప్ అయ్యిందట. దాంతో వెంటనే ఆమె కాలు పట్టుకొని.. ఏం కాదు అమ్మ అంటూ.. స్ప్రే తెప్పించి కాలుకు స్ప్రే చేశారట. అంత పెద్ద హీరో అయ్యుండి తన కాలు పట్టుకొని అమ్మ అంటూ ఎంతో బాగా చూసుకున్నారట. ఈ విషయం చెప్తూ ఆమె ఎన్టీఆర్ ఎంతో మంచివాడు అంటూ మురిసిపోయారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి.