ఓటేస్తూ సెల్ఫీ తీసుకుంటే..వేటే..!

| Edited By: Pardhasaradhi Peri

Jan 22, 2020 | 4:26 PM

పోలింగ్ కేంద్రాల్లోకి ఎన్నికల సిబ్బంది సెల్‌ఫోన్లను అనుమతించరు. ఎన్నికల ఏజెంట్లకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది. ఒకవేళ ఓటు వేసిన అనంతరం బయటకు వచ్చి..ఆ ఓటు ఎవరికి వేశారో తెలిసేలా సెల్ఫీలు గట్రా తీసుకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. పంచాయితీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్ సందర్భంగా ఈ తరహా చర్యలకు పాల్పడ్డవారిపై అధికారలు కేసులు నమోదు చేయనున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో ఇలా చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాదు, ఆ ఓటును […]

ఓటేస్తూ సెల్ఫీ తీసుకుంటే..వేటే..!
Follow us on

పోలింగ్ కేంద్రాల్లోకి ఎన్నికల సిబ్బంది సెల్‌ఫోన్లను అనుమతించరు. ఎన్నికల ఏజెంట్లకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది. ఒకవేళ ఓటు వేసిన అనంతరం బయటకు వచ్చి..ఆ ఓటు ఎవరికి వేశారో తెలిసేలా సెల్ఫీలు గట్రా తీసుకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. పంచాయితీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్ సందర్భంగా ఈ తరహా చర్యలకు పాల్పడ్డవారిపై అధికారలు కేసులు నమోదు చేయనున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో ఇలా చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాదు, ఆ ఓటును కూడా చెల్లనిదిగా పరిగణిస్తారు. 17 ఏ చట్టం ప్రకారం ఎన్నికల అధికారి జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో పలువురు యువ ఓటర్లు..తమ హక్కును వినియోగించుకున్న అనంతరం బ్యాలెట్ పేపర్లను సోషల్ మీడియాలో ఫోస్ట్ చెయ్యడం, సెల్ఫీలు దిగడం వంటి దూకుడు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు పై హెచ్చరికలు జారీ చేశారు.