ఝార్ఖండ్‌లో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. డుంకా అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతాబలగాలకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ జవాన్ మృతి చెందగా.. మరో నలుగురు ఎస్‌ఎస్‌బీ జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని వెంటనే హెలికాప్టర్ ద్వారా రాంచీలోని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. డుంకా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారంతో ప్రత్యేక బలగాలు అక్కడికి చేరుకున్నాయి. అయితే మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అయితే జవాన్లు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు లేదా ఐదుగురు మావోలు చనిపోయి ఉంటారని ఎస్పీ రమేష్ తెలిపారు.