శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్..!

| Edited By: Pardhasaradhi Peri

Jan 24, 2020 | 6:51 PM

రిపబ్లిక్ డే సందర్భంగా హైదరాబాద్‌లో ఎలాంటి అవాంఛిత సంఘటనలకు అవకాశం ఇవ్వకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా రిపబ్లిక్ డేకు ముందు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) వద్ద హై అలర్ట్ జారీ చేశారు. విమానాశ్రయం లోపల సందర్శకుల ప్రవేశం కూడా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2020 జనవరి 31 వరకు ప్రయాణికులు తమ వద్ద ఉన్న అన్ని గుర్తింపు కార్డులను తమవెంట ఉంచుకోవాలని భద్రతా అధికారులు కోరారు. రిపబ్లిక్ డే సందర్భంగా […]

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్..!
Follow us on

రిపబ్లిక్ డే సందర్భంగా హైదరాబాద్‌లో ఎలాంటి అవాంఛిత సంఘటనలకు అవకాశం ఇవ్వకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా రిపబ్లిక్ డేకు ముందు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) వద్ద హై అలర్ట్ జారీ చేశారు. విమానాశ్రయం లోపల సందర్శకుల ప్రవేశం కూడా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2020 జనవరి 31 వరకు ప్రయాణికులు తమ వద్ద ఉన్న అన్ని గుర్తింపు కార్డులను తమవెంట ఉంచుకోవాలని భద్రతా అధికారులు కోరారు.

రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26 నుండి  31వ తేదీ వరకు విమానాశ్రయంపై నిఘా కొనసాగుతుందని, అప్పటి వరకూ సందర్శకులకు అనుమతి ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. విమానాశ్రయం లోపలికి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు, గణతంత్ర దినోత్సవానికి ముందు భద్రతా చర్యల్లో భాగంగా ఢిల్లీలో కూడా హై అలర్ట్ జారీ చేయబడింది.