కొమురం భీం జిల్లాలో కొలిక్కిరాని పులి వేట, ఆపరేషన్ టైగర్‌కు ఎన్టీసీఏ నిబంధనలు అడ్డు, మత్తు మందు ప్రయోగానికి బ్రేక్

|

Jan 15, 2021 | 8:24 AM

కొమురం భీం జిల్లా అటవిశాఖ అధికారులను ముప్పు తిప్పలు పెడుతోంది మ్యాన్ ఈటర్. దట్టమైన అటవీ ప్రాంతంలో సంచరిస్తూ..

కొమురం భీం జిల్లాలో కొలిక్కిరాని పులి వేట, ఆపరేషన్ టైగర్‌కు ఎన్టీసీఏ నిబంధనలు అడ్డు, మత్తు మందు ప్రయోగానికి బ్రేక్
Follow us on

కొమురం భీం జిల్లా అటవిశాఖ అధికారులను ముప్పు తిప్పలు పెడుతోంది మ్యాన్ ఈటర్. దట్టమైన అటవీ ప్రాంతంలో సంచరిస్తూ స్పెషల్ యాక్షన్ టీంలకు సైతం టైగర్ చిక్కడంలేదు. కాగా, ఆపరేషన్ టైగర్ కు ఎన్టీసీఏ నిబంధనలు అడ్డువస్తున్నాయి. మత్తుమందు ప్రయోగానికి బ్రేక్ పడింది. మరోవైపు, ఎరను సైతం పులి చాకచక్యంగా లాక్కెళ్లి తినేస్తోంది తప్పితే పులి దొరకడం లేదు. ఏదేమైనప్పటికీ పులి కోసం అటవీ అధికారుల అన్వేషణ మాత్రం కొనసాగుతోంది. ఇక, పులి భయానికి పత్తి చేల వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు బెజ్జూర్ మండలానికి చెందిన రైతులు. అటవీ ప్రాంతాలతో పాటు పంట పొలాల వైపు సైతం ఎవరూ వెళ్లొద్దని అధికారులు ఇప్పటికే ఆంక్షలు విధించారు.

దీంతో చేలలోకి ఎవరూ వెళ్లడం లేదు. అయితే, చేతికందిన పత్తి అంతా చేలోనే ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు, అటవీప్రాంతంలో డ్రోన్ కెమెరాతో పులి అన్వేషణ కొనసాగుతోంది. కాగా, నిన్న సులుగుపల్లి లో కనిపించిన పులి.. తాము టార్గెట్ చేసిన పులి ఒక్కటేనని సిఎఫ్ వినోద్ కుమార్ చెప్పారు. ఎక్కడ క్యాటిల్ కిల్ జరిగితే అక్కడికి మా టీమ్ అరగంటలో చేరుకునేలా ప్లాన్ చేసుకున్నామని ఆయన తెలిపారు.  నాలుగు డ్రోన్‌ కెమెరాలతో ఆపరేషన్ టైగర్ ఫైనల్ ఫైట్, పులికోసం కందిభీమన్న అటవీ ప్రాంతంలో ఎడతెగని ఉత్కంఠ