నాలుగు డ్రోన్‌ కెమెరాలతో ఆపరేషన్ టైగర్ ఫైనల్ ఫైట్, పులికోసం కందిభీమన్న అటవీ ప్రాంతంలో ఎడతెగని ఉత్కంఠ

కొమరం భీమ్‌ జిల్లాలో కందిభీమన్న అటవీప్రాంతంలో ఆపరేషన్‌ టైగర్‌ ఉత్కంఠగా సాగుతోంది. ఏ క్షణంలోనైనా.. పులిని పట్టుకునే..

  • Venkata Narayana
  • Publish Date - 12:23 pm, Thu, 14 January 21

కొమరం భీమ్‌ జిల్లాలో కందిభీమన్న అటవీప్రాంతంలో ఆపరేషన్‌ టైగర్‌ ఉత్కంఠగా సాగుతోంది. ఏ క్షణంలోనైనా.. పులిని పట్టుకునే దిశగా ఆపరేషన్ నిర్వహిస్తోంది ర్యాపిడ్‌ టీమ్. పులి కోసం మహారాష్ట్ర, టీఎస్ ర్యాపిడ్ రెస్క్యూ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. 40 మంది స్పెషల్‌ యాక్షన్‌ టీమ్‌ ఈ ఆపరేషన్ చేపట్టాయి. పులి కదలికలు గుర్తించేందుకు నాలుగు డ్రోన్‌ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. మత్తు మందు ప్రయోగం నుంచి రెండుసార్లు తప్పించుకుంది పులి. మ్యాన్‌ ఈటర్‌ను బోను ఎక్కించడమే టార్గెట్ గా ఆపరేషన్ టైగర్ ఫైనల్ ఫైట్ కొనసాగుతోంది. ఇప్పటికే పులి కోసం ఎరగా వేసిన ఆవుపై దాడి చేసి చంపిన పులి.. మరోసారి వచ్చే అవకాశాలున్నట్టు భావిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో 20 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన మంచెపై పులి కోసం కాచుకు కూర్చుంది ర్యాపిడ్ రెస్క్యూ టీం. మత్తు మందు ఇచ్చే వెటర్నరీ వైద్యుల్ని అక్కడే అందుబాటులో ఉంచారు. పులి ఫారెస్ట్‌ను క్రాస్ చేసే రాజక్క దేవార, మత్తడి స్ప్రింగ్‌ ఆనకట్ట సమీపంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘా ద్వారా పులి కదలికల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది ర్యాపిడ్ రెస్క్యూ టీం.