84 ఏళ్ల వృద్ధుడికి డీఎన్‌ఏ పరీక్ష.. సుప్రీం ఆదేశం..

14 ఏళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడి తల్లిని చేసినట్లు ఆరోపణలపై అరెస్టయిన 84 ఏళ్ల వృద్ధుడికి డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బాధితురాలికి పుట్టిన పిల్లాడికి తండ్రి నిందితుడైన వృద్ధుడేనా

84 ఏళ్ల వృద్ధుడికి డీఎన్‌ఏ పరీక్ష.. సుప్రీం ఆదేశం..
Follow us

| Edited By:

Updated on: Jul 18, 2020 | 5:39 PM

14 ఏళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడి తల్లిని చేసినట్లు ఆరోపణలపై అరెస్టయిన 84 ఏళ్ల వృద్ధుడికి డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బాధితురాలికి పుట్టిన పిల్లాడికి తండ్రి నిందితుడైన వృద్ధుడేనా అని నిర్ధారించడానికి డీఎన్‌ఏ పరీక్ష జరుపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బాధితురాలిపై లైంగికదాడి చేయలేదని నిందితుడు చెప్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లాడితోపాటు నిందితుడైన వృద్ధుడికి కూడా డీఎన్ఏ పరీక్ష చేస్తే, నిందితుడు నిజంగా పిల్లాడి తండ్రి అవునో.. కాదో.. తెలుసుకునే వీలుంది.

మైనర్ పై లైంగికదాడి చేసిన ఆరోపణలపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన అనంతరం నిందితుడిని జైలుకు పంపారు. తనకిప్పుడు 84 ఏళ్ల వయసు ఉందని, లైంగికదాడి చేసేంత వయసు తనకు లేదని కోర్టుకు విన్నవించాడు. నిందితుడు కోల్‌కతా హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు కూడా చేశాడు. అయితే, కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. వృద్ధుడు లైంగిక కార్యకలాపాలకు సమర్థుడని నిరూపించేందుకు తమ వద్ద ఆధారాలేవీ లేవని పశ్చిమ బెంగాల్ పోలీసులు తన నివేదికలో పేర్కొన్నారు.