వోడా ఫోన్ కి రూ. 733 కోట్లు చెల్లించండి.. ఐటీ శాఖకు సుప్రీంకోర్టు ఆదేశం

| Edited By: Pardhasaradhi Peri

Apr 29, 2020 | 7:27 PM

ఒక వివాదంలో వోడా ఫోన్ ఐడియాకి సుప్రీంకోర్టు నుంచి కొంత ఊరట లభించింది. ఈ సంస్థకు రూ. 733 కోట్లు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2014-15 నుంచి 2017-18 వరకు తమ టాక్స్ రిటర్నులను ఐటీ శాఖ ప్రాసెస్ చేయలేదని వోడాఫోన్ అత్యున్నత న్యాయస్థానానికెక్కింది. తమకు మొత్తం పూర్తిగా అంటే.. 4,700 కోట్లను రీఫండ్ చేయాలని ఆశాఖను ఆదేశించాలని కోర్టును కోరింది. అయితే ఈ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. రూ. 733 కోట్లను […]

వోడా ఫోన్ కి రూ. 733 కోట్లు చెల్లించండి.. ఐటీ శాఖకు సుప్రీంకోర్టు ఆదేశం
Follow us on

ఒక వివాదంలో వోడా ఫోన్ ఐడియాకి సుప్రీంకోర్టు నుంచి కొంత ఊరట లభించింది. ఈ సంస్థకు రూ. 733 కోట్లు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2014-15 నుంచి 2017-18 వరకు తమ టాక్స్ రిటర్నులను ఐటీ శాఖ ప్రాసెస్ చేయలేదని వోడాఫోన్ అత్యున్నత న్యాయస్థానానికెక్కింది. తమకు మొత్తం పూర్తిగా అంటే.. 4,700 కోట్లను రీఫండ్ చేయాలని ఆశాఖను ఆదేశించాలని కోర్టును కోరింది. అయితే ఈ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. రూ. 733 కోట్లను నాలుగు వారాల్లోగా వోడాఫోన్ ఐడియాకు చెల్లించాలని సుప్రీంకోర్టు ఐటీ శాఖను ఆదేశించింది. గత ఏడాది జనవరిలో ఈ కేసు సుప్రీంకోర్టుకెక్కినప్పటి నుంచి ఐటీ శాఖ పన్నెండు వాయిదాలను కోరిందని, రీఫండ్ చెల్లింపులో చాలా జాప్యం చేస్తూ వచ్చిందని వోడాఫోన్ సంస్థ ఆరోపించింది.