SBI: వినియోగదారులను జాగ్రత్తగా ఉండమని చెబుతోన్న ఎస్‌బీఐ.. ఎట్టి పరిస్థితుల్లో ఆ వివరాలు ఇవ్వొద్దంటూ.. ట్వీట్‌..

SBI Alerts Customers: ఇటీవల బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. రకరకాల మార్గాల ద్వారా వినియోగదారులను మోసం చేయడానికి సైబర్‌ నేరగాళ్లు వేచి చూస్తున్నారు. ఏ మాత్రం ఆదమరిచినా..

SBI: వినియోగదారులను జాగ్రత్తగా ఉండమని చెబుతోన్న ఎస్‌బీఐ.. ఎట్టి పరిస్థితుల్లో ఆ వివరాలు  ఇవ్వొద్దంటూ..  ట్వీట్‌..

Edited By:

Updated on: Jan 18, 2021 | 8:18 AM

SBI Alerts Customers: ఇటీవల బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. రకరకాల మార్గాల ద్వారా వినియోగదారులను మోసం చేయడానికి సైబర్‌ నేరగాళ్లు వేచి చూస్తున్నారు. ఏ మాత్రం ఆదమరిచినా అకౌంట్‌లోని డబ్బుల మనకు తెలియకుండానే మాయమవుతున్నాయి. ఇటీవల కేవైసీ వెరిఫికేషన్‌ పేరిట ఇలాంటి మోసాలు బాగా జరుగుతున్నాయి.
ఈ తరుణంలో దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. వినియోగదారులకు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఓ వీడియాతో ఈ విషయాన్ని వెల్లడించింది. కొందరు మోసగాళ్లు బ్యాంకు ప్రతినిధుల పేరిట కాల్, మెసేజ్ చేసి కేవైసీ వెరిఫికేషన్ కోసం వ్యక్తిగత వివరాలు తీసుకుంటున్నారని హెచ్చరించింది. వారికి బ్యాంకు ఖాతా, ఆధార్ నెంబర్ లాంటి వివరాలు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేసింది. అలాంటి అంశాలు దృష్టికి వస్తే https://cybercrime.gov.in/కు తెలియజేయాలని సూచించింది. ఇటీవలి సమయంలో కేవైసీ పేరిట మరిన్ని మోసాలు జరుగుతున్నట్లు వెలుగులోకి వస్తున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అంతేకాకుండా OTPఎవరితోనూ పంచుకోవద్దని సూచించింది.

Also Read: భారీ డిస్కౌంట్ ప్రకటించిన మహీంద్రా అండ్ మహీంద్రా.. ఒక్కో వాహనంపై ఎంత తగ్గింపు అంటే…