‘సరిలేరు’ ట్రైలర్ ఎప్పుడంటే..!

‘పటాస్’, ‘రాజా ది గ్రేట్’, ‘సుప్రీమ్’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్మ్ మేజర్‌గా మహేష్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తుండగా లేడి సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ రోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా.. […]

సరిలేరు ట్రైలర్ ఎప్పుడంటే..!

Updated on: Jan 07, 2020 | 5:33 PM

‘పటాస్’, ‘రాజా ది గ్రేట్’, ‘సుప్రీమ్’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్మ్ మేజర్‌గా మహేష్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తుండగా లేడి సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ రోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా.. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఇక సినిమాపై అంచనాలను పెంచడానికి ట్రైలర్‌ను ఈ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. దీనికి అనుగుణంగా రాత్రి 9.09 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ఓ పోస్టర్‌ రిలీజ్ చేశారు.