సారా అలీఖాన్‌ను ‘హీరోపంత్ 2’ నుంచి ఎందుకు తప్పించారో తెలుసా? డ్రగ్స్ కేసే అమ్మడు కొంప ముంచిందా.?

|

Dec 18, 2020 | 7:08 PM

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందరినీ గడగడలాడించిన డ్రగ్స్ కేసు సారా కొత్త సినిమా అవకాశాన్ని దూరం చేసిందనే వార్త సంచలనంగా మారింది. సారాను సినిమా నుంచి తప్పించడానికి.. ఇటీవల బయటపడ్డ డ్రగ్స్ కేసే కారణమని చిత్ర యూనిట్ తెలిపిందట.

సారా అలీఖాన్‌ను ‘హీరోపంత్ 2’ నుంచి ఎందుకు తప్పించారో తెలుసా? డ్రగ్స్ కేసే అమ్మడు కొంప ముంచిందా.?
సౌత్ నుండి కూడా పిలుపు అందిందట. కాని మంచి కథ మరియు హీరో కోసం వెయిట్ చేస్తున్నట్లుగా చెబుతోంది. 
Follow us on

Sara ali khan missed movie due to drugs case: తండ్రి సైఫ్ అలీఖాన్ నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్. చేసినవి కొన్ని సినిమాలే అయినా నటిగా మంచి మార్కులు కొట్టేసిందీ చిన్నది. సినిమాల్లోకి రాక ముందు చాలా బొద్దుగా ఉన్న సారా.. పట్టుదలతో స్లిమ్‌గా మారింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందరినీ గడగడలాడించిన డ్రగ్స్ కేసు సారా కొత్త సినిమా అవకాశాన్ని దూరం చేసిందనే వార్త సంచలనంగా మారింది.
ఇంతకీ విషయం ఏంటంటే.. టైగర్ ష్రాప్ హీరోగా తెరకెక్కుతోన్న హీరోపంత్ 2 సినిమాలో సారా అలీఖాన్ హీరోయిన్‌గా నటించాల్సింది. అయితే తీరా చిత్రం సెట్స్‌పైకి వెళ్లే సమయానికి సారాను ప్రాజెక్టు నుంచి తప్పిస్తున్నట్లు చిత్ర యూనిట్ చెప్పింది. సారాను సినిమా నుంచి తప్పించడానికి.. ఇటీవల బయటపడ్డ డ్రగ్స్ కేసే కారణమని చిత్ర యూనిట్ తెలిపిందట. ఈ విషయం తెలుసుకున్న సారా ఒక్కసారిగా షాక్‌కి గురైందని సమాచారం. దీంతో సారా స్థానంలో తారా సుతారియాను తీసుకున్నారు. సారా అలీఖాన్ ప్రస్తుతం వరుణ్ ధవన్ హీరోగా తెరకెక్కుతోన్న కూలీ నెం1 చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్ర‌గ్స్ కోణం వెలువ‌డటంతో ఎన్సీబీ అధికారులు దీపికాప‌దుకొనే, ర‌కుల్‌తోపాటు సారా అలీఖాన్‌ను విచారించిన విషయం తెలిసిందే.