Samantha: ఒకప్పుడు నిద్రలేని రాత్రులు గడిపాను. కానీ.. ఇప్పుడు మాత్రం నవ్వొస్తోంది.. అభిమానులతో సామ్ చిట్ చాట్..

|

Jan 27, 2021 | 5:57 PM

Samantha Chit Chat With Fans: ‘ఏం మాయ చేశావే’ సినిమాతో తెలుగు కుర్రకారును నిజంగానే మాయ చేసింది అందాల తార సమంత. ఇక ఆ సినిమాలో కలిసి నటించిన హీరో నాగ చైతన్యను వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా మారిందీ చెన్నై బ్యూటీ...

Samantha: ఒకప్పుడు నిద్రలేని రాత్రులు గడిపాను. కానీ.. ఇప్పుడు మాత్రం నవ్వొస్తోంది.. అభిమానులతో సామ్ చిట్ చాట్..
Follow us on

Samantha Chit Chat With Fans: ‘ఏం మాయ చేశావే’ సినిమాతో తెలుగు కుర్రకారును నిజంగానే మాయ చేసింది అందాల తార సమంత. ఇక ఆ సినిమాలో కలిసి నటించిన హీరో నాగ చైతన్యను వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా మారిందీ చెన్నై బ్యూటీ.
వివాహం తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటోన్న సమంత వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. ఇక ఓవైపు సినిమాలు, మరోవైపు వ్యాపారంతో నిత్యం బిజీగా గడిపే సమంత సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అభిమానులతో టచ్‌లో ఉంటూ.. సినిమా, వ్యాపారానికి సంబంధించిన వివరాలను వారితో షేర్ చేసుకోవడం సామ్‌కు అలవాటు. ఇదే క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలు, వాటికి తాను సమాధానమిస్తున్న వీడియోలను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసిందీ బ్యూటీ. ఈ క్రమంలోనే.. ‘మీకు ఎదురయ్యే ట్రోలింగ్ ఎలా ఎదుర్కొంటారు.?’ అని అడిగిన ఓ అభిమాని ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘ఒకప్పుడు ట్రోలింగ్ వల్ల నిద్ర లేని రాత్రులు గడిపాను. కానీ ఇప్పుడు మాత్రం నవ్వొస్తుంది. అయినా మనపై ట్రోలింగ్ చేస్తున్నారంటే.. మనం ఎంతో ఎత్తుకు ఎదిగామనిస్తుంది’ చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఇక ‘మీ కెరీర్‌లో మీరు చేసిన పాత్రల్లో మీకు నచ్చింది ఏంటని’.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఓ బేబీ, ఫ్యామిలీ మ్యాన్’ అని సమాధానమిచ్చింది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లో సమంత ఉగ్రవాదిగా నటిస్తోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కానుంది.

Also Read: Kartik Aaryan Team Up Shah Rukh: డిఫరెంట్ లవ్ స్టోరీతో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌ తో జతకట్ట నున్న బాలీవుడ్ బాద్షా