జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. అనూహ్యరీతిలో బీజేపీ, ఎంఐఎం పార్టీలు విజయం సాధిస్తున్నాయి. ఇప్పటివరకు టీఆర్ఎస్ 73 స్థానాల్లో ముందంజలో ఉండగా, బీజేపీ 41, ఎంఐఎం 37 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. తాజాగా సైదాబాద్ బీజేపీ అభ్యర్థి కొత్త కాపు అరుణ విజయం సాధించారు. అదే విధంగా ముసారంగ్ బాగ్‌లో బీజేపీ అభ్యర్థి బొక్క భాగ్యలక్ష్మి గెలుపొందారు. ఇక ఓల్డ్ మలక్‌పేటను ఎంఐంఎం తన ఖాతాలో వేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి అయేషా జహం నసీం సమీప ప్రత్యర్థిపై విజయం సాధించారు. అలాగే అక్బర్ బాగ్‌లో ఎంఐఎం అభ్యర్థి మినాజోద్దీన్ గెలుపొందారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..