రాజస్థాన్ మహారాణి సాయిపల్లవి

|

Aug 11, 2020 | 8:13 PM

తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన కోలీవుడ్ బ్యూటీ సాయిపల్లవి త్రోబ్యాక్‌ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మధ్య లాక్ డౌన్ సమయంలో తన తల్లితో కలిసి కారులో షికారు చేస్తూ..

రాజస్థాన్ మహారాణి సాయిపల్లవి
Follow us on

తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన కోలీవుడ్ బ్యూటీ సాయిపల్లవి త్రోబ్యాక్‌ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మధ్య లాక్ డౌన్ సమయంలో తన తల్లితో కలిసి కారులో షికారు చేస్తూ.. తొలకరిని ఎంజాయ్ చేస్తున్న ఫోటో వైరల్ అయ్యింది. ఇప్పుడు ఈ వెకేషన్‌ స్టిల్‌ను అందరితో షేర్ చేసుకుంది సాయిపల్లవి. అక్కడి టూరిజం స్పాట్‌లను చుట్టేసిందట. అది కూడా అక్కడి సంప్రదాయ దుస్తుల్లో తెగ ఫోటోలు దిగిందట. రాజువారి కోటలో మన రాణిగారు తెగ ఎంజాయ్‌ చేశారట.

అంతేకాదు అక్కడి ట్రెడిషనల్ డ్రెస్‌లో మెరిసి.. మురిసిపోతూ.. తనకు ఎంతో ఇష్టమైన మహరాణి స్టిల్‌లో ఫోటో సూట్ చేసింది. ఆ రాజ్‌పుత్‌ రాణి గెటప్‌లో కోటపై నుంచి తొంగి చూస్తున్న స్టిల్‌ ను సాయిపల్లవి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అందులో ఓ ఫోటో ఇప్పుడు సాయిపల్లవి ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఇది చూసిన సాయిపల్లవి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అచ్చం రాణిలానే ఉన్నారంటూ రీ ట్వీట్ చేస్తున్నారు.